జయ సమాధి వద్ద పన్నీర్ సెల్వం నివాళులు... ప్రభుత్వాన్ని తరిమేస్తామంటూ...
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అమ్మ నమ్మినబంటు పన్నీర్ సెల్వం గురువారం నాడు జయలలిత సమాధి వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన శశికళపై నిప్పులు చెరిగారు. " జయ మరణానికి శశి కుటుంబమే కారణం. ఈ ప్రభుత్వంలో అమ్మ అనుచరులు ఎవరూ లేరు. అమ్మ పార్టీని కాపాడాల్సిన
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అమ్మ నమ్మినబంటు పన్నీర్ సెల్వం గురువారం నాడు జయలలిత సమాధి వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన శశికళపై నిప్పులు చెరిగారు. " జయ మరణానికి శశి కుటుంబమే కారణం. ఈ ప్రభుత్వంలో అమ్మ అనుచరులు ఎవరూ లేరు. అమ్మ పార్టీని కాపాడాల్సిన బాధ్యత నాపై వుంది.
ఇది ప్రజా వ్యతిరేక ప్రభుత్వం. ఏడున్నర కోట్ల తమిళ ప్రజలు మా వెంటే వున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తా. పళని వర్గమంతా శశికళ చెప్పినట్లు వినాల్సిందే. ఇది అమ్మ ప్రభుత్వం కాదు. ఈ ప్రభుత్వాన్ని తరిమికొట్టేంత వరకూ విశ్రమించేది లేదు. వేద నిలయంలో శశి కుటుంబాన్ని ఉండనివ్వం'' అంటూ హెచ్చరించారు.