శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 6 డిశెంబరు 2016 (13:37 IST)

జయలలితను వైఎస్సార్‌తో పోల్చిన రోజా.. అమ్మ మృతిపై పవన్ స్పందన..

తమిళనాడు సీఎం జయలలిత మృతి పట్ల యావత్తు దేశం ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో తమిళనాడుకు అమ్మలేని లోటు తీర్చలేనిదని వైకాపా ఎమ్మెల్యే రోజా తెలిపారు. జయలలిత.. ఎన్నో కష్టాలకోర్చి ముఖ్యమంత్రి

తమిళనాడు సీఎం జయలలిత మృతి పట్ల యావత్తు దేశం ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో తమిళనాడుకు అమ్మలేని లోటు తీర్చలేనిదని వైకాపా ఎమ్మెల్యే రోజా తెలిపారు. జయలలిత.. ఎన్నో కష్టాలకోర్చి ముఖ్యమంత్రిగా ఎదిగారని తెలిపారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించవచ్చని జయలలిత నిరూపించారని రోజా అన్నారు. జయలలిత ఓ శక్తివంతమైన నాయకురాలని కొనియాడారు. ఆమె ఇప్పుడలేరంటే.. ఎంతో బాధగా ఉందని తెలిపారు. 
 
దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి విషయంలో కూడా ఇలాగే జరిగిందని, తానంటే జయలలితకు చాలా ఇష్టమని, తనతో తెలుగులోనే మాట్లాడేవారని తెలిపారు. అంతేగాక, తన పెళ్లికి కూడా హాజరయ్యారని తెలిపారు. దేశం ఒక మంచి నాయకురాలిని కోల్పోయిందని చెప్పారు.
 
పురట్చి తలైవి.. తమిళనాడు సీఎం జయలలిత మృతి తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని సినీ నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు. అనారోగ్యంతో అస్పత్రిలో చేరిన ఆమె ఆరోగ్యంతో తిరిగి ఇంటికి చేరుకుంటారని దేశ ప్రజలతో పాటు తానూ ఆశించానన్నారు. మూడు దశాబ్దాలకు పైగా తమిళనాడు, భారతదేశ రాజకీయాలపై జయలలిత చెరగని ముద్ర వేశారని అన్నారు. పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారన్నారు.