గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 3 నవంబరు 2021 (11:09 IST)

స్వదేశానికి చేరుకున్న ప్రధాని నరేంద్ర మోడీ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వదేశానికి చేరుకున్నారు. ఆయన చేపట్టిన ఐదు రోజుల విదేశీ పర్యటనను విజయవంతంగా ముంగించుకుని స్వదేశానికి వచ్చారు. ఇటలీ, యూకే పర్యటన ముగించుకొని ఢిల్లీలో దిగారు. 
 
ఈ పర్యటనలో భాగంగా జీ20, కాప్​26 ప్రపంచ వాతావరణ సదస్సుల్లో పాల్గొన్నారు. ఇటలీ పర్యటనలో  భాగంగా వాటికన్ సిటీని సైతం మోడీ సందర్శించారు. క్రైస్తవ మతగురువు, క్యాథలిక్ చర్చిల అధినేత పోప్ ఫ్రాన్సిస్​ను కలిశారు. భారత్​కు రావాలని పోప్​ను మోడీ ప్రత్యేకంగా ఆహ్వానించారు.