ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 24 జులై 2017 (09:56 IST)

అంతరిక్షయోధుడు ఇకలేరు.. ఇస్రో మాజీ చీఫ్‌ కన్నుమూత

అంతరిక్షయోధుడిగా పేరుగడించిన ఇస్రో మాజీ చీఫ్, ప్రఖ్యాత శాస్త్రవేత్త ప్రొఫెసర్‌ ఉడిపి రామచంద్రరావు(85) సోమవారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయన మరణంతో భారత అంతరిక్ష సంస్థ(ఇస్రో) షాక్‌కు గురిచేసింది. గత

అంతరిక్షయోధుడిగా పేరుగడించిన ఇస్రో మాజీ చీఫ్, ప్రఖ్యాత శాస్త్రవేత్త ప్రొఫెసర్‌ ఉడిపి రామచంద్రరావు(85) సోమవారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయన మరణంతో భారత అంతరిక్ష సంస్థ(ఇస్రో) షాక్‌కు గురిచేసింది. గత ఏడాదిగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన సోమవారం తెల్లవారుజామున 2.30 గంటలకు తుది శ్వాస విడిచారు.
 
1984-1994 మధ్య ఇస్రోకు ఆయన ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. కొన్ని విదేశీ విశ్వవిద్యాలయాల్లో బోధకుడిగా పనిచేశారు కూడా. ప్రస్తుతం ఫిజికల్‌ రీసెర్చ్‌ లాబోరేటరీ పరిపాలనా విభాగ ఛైర్మన్‌గానూ, తిరువనంతపురంలోని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీకు ఛాన్స్‌లర్‌గా కొనసాగుతున్నారు. 
 
అంతేకాకుండా, పలు ఉన్నత పదవులు నిర్వహించారు. విదేశీ యూనివర్శిటీల్లోనూ ఆయన పనిచేశారు. పది అంతర్జాతీయ అవార్డులు, మరెన్నో జాతీయ అవార్డులు అందుకున్నారు. ఇస్రో ఛైర్మన్‌గా పలు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు చేపట్టారు. ఆర్యభట్ట నుంచి మార్స్ ఆర్బిటర్ మిషన్ ప్రాజెక్టు వరకు ఆయన పనిచేశారు. ఈ జనవరిలో రావుకు ప్రభుత్వం పద్మవిభూషణ్ ప్రకటించింది. అయితే ఆ గౌరవాన్ని తాను మరణానంతరం అందుకుంటానని ఆయన చెప్పడం విశేషం. 
 
కాగా, సతీష్‌ ధావన్ తర్వాత పదేళ్ల పాటు ఇస్రోకు ఛైర్మన్‌గా వ్యవహరించింది రావు మాత్రమే. మామ్‌ మిషన్‌ కోసం ఇస్రోతో కలసి ఆయన పనిచేశారని సీనియర్‌ శాస్త్రవేత్తలు తెలిపారు. ఇక ఆయన లేరనే మాట ఊహించడానికి కూడా కష్టంగా ఉందని ఆవేదన వ్యక్తంచేశారు. యూఆర్‌ రావు మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్వీటర్‌ ద్వారా స్పందించారు. దేశానికి ఆయన అందించిన సేవలు మరువలేనివని కొనియాడారు.