కదిలే రైలులో ఎక్కాలనుకున్నాడు.. కాలు జారి పట్టాలకిందకు జారుకున్నాడు.. (video)
తమిళనాడు రాజధాని చెన్నై నగరంలోని ఎగ్మూర్ రైల్వే స్టేషన్‌లో కదిలే రైలులో ఎక్కేందుకు ప్రయత్నించిన ఓ యువకుడు కాలుజారికిందపడ్డాడు. అయితే కాలుజారిన కిందపడిపోయిన ఆ యువకుడిని ఓ పోలీస్ సమర్థవంతంగా రక్షించారు.
తమిళనాడు రాజధాని చెన్నై నగరంలోని ఎగ్మూర్ రైల్వే స్టేషన్‌లో కదిలే రైలులో ఎక్కేందుకు ప్రయత్నించిన ఓ యువకుడు కాలుజారికిందపడ్డాడు. అయితే కాలుజారిన కిందపడిపోయిన ఆ యువకుడిని ఓ పోలీస్ సమర్థవంతంగా రక్షించారు. సోమవారం చెన్నై ఎగ్మోర్ రైల్వేస్టేషన్లో చెన్నై-దాదర్‌ల మధ్య నడిచే రైలు పట్టాల నుంచి కదిలింది. ఈ రైలులో ఎక్కేందుకు ఉత్తరాది యువకుడు ప్రయత్నించాడు.
అయితే రైలు ఎక్కే క్రమంలో కాలు జారి కిందపడిపోయాడు. పట్టాల కిందికి జారుకునేలోపే ఓ పోలీసు సమర్థవంతంగా ఆతడిని కాపాడాడు. యువకుడి వెనక ధరించిన బ్యాగును పట్టుకుని లాగడంతో ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఈ ఘటన రైల్వే స్టేషన్లోని సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ప్రమాదానికి గురైన యువకుడిని కాపాడిన పోలీసుపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.