శనివారం, 15 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 14 డిశెంబరు 2016 (14:06 IST)

వార్ధా తుఫాను ఎఫెక్ట్: రానున్న 24 గంటల్లో తమిళనాడులో భారీ వర్షాలు..

వార్ధా తుఫానుతో చెన్నై ప్రజలు వణికిపోయిన నేపథ్యంలో.. వాతావరణ శాఖాధికారులు మరో బాంబు పేల్చారు. వచ్చే 12గంటల్లో తమిళనాడు, దక్షిణ కర్ణాటక, ఉత్తర కేరళల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయని వాతావర

వార్ధా తుఫానుతో చెన్నై ప్రజలు వణికిపోయిన నేపథ్యంలో.. వాతావరణ శాఖాధికారులు మరో బాంబు పేల్చారు. వచ్చే 12గంటల్లో తమిళనాడు, దక్షిణ కర్ణాటక, ఉత్తర కేరళల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. వార్ధా తుపాను తీరం దాటడంతో దాని ప్రభావంతో వర్షాలు కురుస్తాయని.. తద్వారా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. దీంతో తమిళనాట సహాయకచర్యలకు తీవ్ర ఆటంకం కలిగే పరిస్థితి కనిపిస్తోంది. 
 
కాగా, మంగళవారం వార్ధా తుపాను ధాటికి, ఏపీలోని కొన్ని ప్రాంతాలు, తమిళనాడు అతలాకుతలమైన సంగతి తెలిసిందే. వార్ధా తుఫాను ప్రభావంతో వర్షాలు పడే సూచనలు కనిపిస్తున్నాయని వాతావరణ శాఖాధికారులు తెలిపారు. తద్వారా రానున్న 24 గంటల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. వార్ధా తుఫానుతో ఆరువేల కోట్ల నష్టం ఏర్పడిందని.. సహాయక చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయని అధికారులు వెల్లడించారు. మహావృక్షాలు విరిగిపడటంతో వాటిని తొలగించే పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దీంతో విద్యుత్‌కు అంతరాయం కలిగింది.