1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 24 అక్టోబరు 2016 (11:45 IST)

నర్సు ప్రేమను అంగీకరించలేదనీ విషపు ఇంజెక్షన్ వేసుకుని ఆర్మీ డాక్టర్ సూసైడ్

ఓ నర్సు తన ప్రేమ అంగీకరించలేదనీ ఓ ఆర్మీ అధికారి విషపు ఇంజెక్షన్ తీసుకున్నాడు. ఈ ఘటన మధుర నగరంలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే.... మధుర నగరంలోని మిలిటరీ ఆసుపత్రిలో లెఫ్టినెంట్ కల్నల్‌గా డాక్టరు టీవీ

ఓ నర్సు తన ప్రేమ అంగీకరించలేదనీ ఓ ఆర్మీ అధికారి విషపు ఇంజెక్షన్ తీసుకున్నాడు. ఈ ఘటన మధుర నగరంలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే.... మధుర నగరంలోని మిలిటరీ ఆసుపత్రిలో లెఫ్టినెంట్ కల్నల్‌గా డాక్టరు టీవీ జాఘవ్ అనే వ్యక్తి పని చేస్తున్నాడు. ఇదే ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న ఓ మహిళను ఏకపక్షంగా ప్రేమిస్తూ వచ్చాడు. 
 
ఇద్దరు పిల్లలున్న డాక్టరు తాను ప్రేమించే నర్సును పని ఉందని చెప్పి మారుమూల ప్రాంతానికి రప్పించాడు. ఆపై డాక్టరు తన ప్రేమను వ్యక్తం చేసి నర్సుపై అత్యాచారం చేసేందుకు యత్నించాడు. అయితే ఆ నర్సు డాక్టర్ యత్నాన్ని అడ్డుకుని, అతడి ఏకపక్ష ప్రేమను నర్సు నిరాకరించింది. 
 
ఈ ఘటనతో ఆందోళన చెందిన డాక్టరు టీవీ జాఘవ్ ఇంటికి తిరిగివచ్చి విషపు ఇంజక్షన్ చేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. డాక్టరు జాఘవ్ తన పైఅధికారి కావడంతో ఆయన పిలవడం వల్ల బయటకు వెళ్లానని, అతడు ఇలా ప్రవర్తిస్తాడని అనుకోలేదని పోలీసులకు బాధిత నర్సు వెల్లడించారు. తాను డాక్టరును ప్రేమించడం లేదని ఆ నర్సు స్పష్టంచేశారు. ఈ ఘటనపై తాము సమగ్ర దర్యాప్తు జరుపుతున్నామని డిప్యూటీ ఎస్పీ అలోక్ మిశ్రా చెప్పారు.