శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Updated : శనివారం, 15 ఏప్రియల్ 2017 (21:14 IST)

ఢిల్లీ రాజీవ్ చౌక్ మెట్రో స్టేషన్‌ టీవీలో పోర్న్ వీడియో ప్రత్యక్షం....

నిత్యం రద్దీగా ఉంటుందా రైల్వే స్టేషన్. అది కూడా దేశ రాజధాని ఢిల్లీలోని రాజీవ్ చౌక్ మెట్రో రైల్వే స్టేషన్. అక్కడ రైళ్ల రాకపోకలు తెలిపేందుకు పెద్దపెద్ద ఎల్ఈడి టీవీలను పెట్టారు. ఐతే ఆ టీవీల్లో ఒక దాంట్లో

నిత్యం రద్దీగా ఉంటుందా రైల్వే స్టేషన్. అది కూడా దేశ రాజధాని ఢిల్లీలోని రాజీవ్ చౌక్ మెట్రో రైల్వే స్టేషన్. అక్కడ రైళ్ల రాకపోకలు తెలిపేందుకు పెద్దపెద్ద ఎల్ఈడి టీవీలను పెట్టారు. ఐతే ఆ టీవీల్లో ఒక దాంట్లో అందరూ షాకయ్యే వీడియో ప్రసారమైంది. రైళ్ల టైం చూద్దామనుకున్న ప్రయాణికులకు షాకిస్తూ ఓ జంట రతి చేసుకుంటూ వున్న వీడియో ప్రత్యక్షమైంది. 
 
హఠాత్తుగా ఆ నీలి చిత్రం ప్రత్యక్షం కావడంతో ప్రయాణికులు బిత్తరపోయారు. స్త్రీలు సిగ్గుతో బిక్కచచ్చిపోయారు. మరికొందరు ఆ నీలిచిత్రాన్ని చూడలేక అక్కడి నుంచి పారిపోయారు. కొందరు యువకులు మాత్రం స్టేషనులో బాధ్యతారాహిత్యంగా అలాంటి దృశ్యాలను ప్రసారం చేసినట్లు చూపేందుకుగాను తమ సెల్ ఫోన్లలో వాటిని బంధించి సోషల్ మీడియాలో అప్ చేశారు. 
 
ఇపుడీ వీడియో హల్చల్ చేస్తోంది. ఈ వీడియో చూసి అప్రమత్తమైన ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ విచారణకు ఆదేశాలు జారీ చేసింది. ఇది ఏప్రిల్ 9వ తేదీ జరుగగా ఆలస్యంగా వెలికి వచ్చింది. కాగా ఇది ప్రకటనల నిమిత్తం అక్కడ ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలియజేశారు.