గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: శుక్రవారం, 17 మార్చి 2017 (15:18 IST)

జైల్లో పడ్డ రేప్ మంత్రి... పిచ్చివాడయిపోతాడేమో? అమిత్ షా అన్నంత పనీ చేశారు...

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అంటే అత్యాచారాలకు కేరాఫ్ అడ్రెస్ అని చెప్పాల్సి వచ్చింది అప్పట్లో. అఖిలేష్ యాదవ్ మంత్రివర్గంలో మంత్రిగా వెలగబెట్టిన గాయత్రి ప్రజాపతి సామూహిక అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఎస్పీ ప్రభుత్వం అధికారంలో ఉన్నంత కాలం ప్ర

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అంటే అత్యాచారాలకు కేరాఫ్ అడ్రెస్ అని చెప్పాల్సి వచ్చింది అప్పట్లో. అఖిలేష్ యాదవ్ మంత్రివర్గంలో మంత్రిగా వెలగబెట్టిన గాయత్రి ప్రజాపతి సామూహిక అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఎస్పీ ప్రభుత్వం అధికారంలో ఉన్నంత కాలం ప్రజాపతి... అదేదో అన్నట్లు పెట్రోలై మండించారు. పోలీసులకు కూడా చుక్కలు చూపించేవారు. కోర్టు ఆదేశాలను సైతం ధిక్కరిస్తూ తప్పించుకుని తిరుగుతుండేవారు. ఆయన అడ్రెస్ ఎక్కడో తెలిసినా కొంతమంది పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకునేందుకు జడుసుకునేవారని అప్పట్లో ప్రచారం జరిగింది. 
 
ఉత్తరప్రదేశ్ ఎన్నికల వేళ భాజపా చీఫ్ అమిత్ షా, తమకు అధికారం రాగానే ప్రజాపతి ఎక్కడ వున్నారో గాలించి వెతికి పట్టి కోర్టు బోనులో నిలబెడతామని ప్రతిజ్ఞ చేశారు. ఆయన అన్నట్లుగానే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో భాజపా అధికారంలోకి వచ్చింది. దానితో గాయత్రి ప్రజాపతిని పోలీసులు పట్టుకున్నారు. అతడిని కోర్టులో ప్రవేశపెట్టగా కోర్టు అతడికి 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. 
 
పాపం ప్రజాపతి జైలులో పెట్టాక ఎవ్వరితోనూ మాట్లాడేందుకు ఉత్సాహం చూపించడంలేదట. ఎటో శూన్యంలోకి చూస్తూ కాలం గడుపుతున్నాడట. కనీసం రాత్రిళ్లు నిద్ర కూడా పోవడం లేదని అంటున్నారు. చూస్తుంటే జైలు శిక్ష ఖరారయితే పిచ్చివాడయిపోతాడేమో అని అంటున్నారు ఆయన వ్యవహారశైలి చూసినవారు.