సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 24 జులై 2023 (20:54 IST)

టమోటాలకు బదులు నిమ్మకాయలు వాడుకోండి.. ప్రతిభా శుక్లా

దేశ వ్యాప్తంగా టమోటా ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టమోటా ధరలు పెరుగుతున్నట్లు అయితే తినడం మానేస్తే అవే తగ్గుతాయని మంత్రి ప్రతిభా శుక్లా సలహా ఇచ్చారు. అంతేకాకుండా టమోటాలకు బదులుగా నిమ్మకాయలు వాడుకోవాలని సూచించారు. 
 
అలాగే ప్రజలు ఇంటి వద్దే టమోటా మొక్కలు పెంచుకోవాలని తెలిపారు. యూపీ సర్కారు చేపట్టిన భారీ చెట్ల పెంపకం కార్యక్రమం కింద మొక్కలు నాటే కార్యక్రమంలో శుక్లా పాల్గొన్నారు. 
 
అనంతరం ఆమె మాట్లాడుతూ.. టమోటాలకు బదులు నిమ్మకాయలు వాడుకోవడం మంచిదని చెప్పారు. అయితే యూపీ మినిస్టర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది.