ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 28 ఏప్రియల్ 2017 (11:09 IST)

బైపోల్‌లో గెలిచి సీఎం కుర్చీలో కూర్చోవడమే లక్ష్యం... ప్లాన్‌ను వివరించిన దినకరన్

అన్నాడీఎంకే అమ్మ పార్టీ నేత టీటీవీ దినకరన్ ప్లాన్ బహిర్గతమైంది. దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణంతో ఖాళీ ఏర్పడిన ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొంది తక్షణం ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవాలని తహతహలా

అన్నాడీఎంకే అమ్మ పార్టీ నేత టీటీవీ దినకరన్ ప్లాన్ బహిర్గతమైంది. దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణంతో ఖాళీ ఏర్పడిన ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొంది తక్షణం ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవాలని తహతహలాడిపోయారు. ఇందుకోసం అన్ని అడ్డదారులు తొక్కేందుకు ఏమాత్రం వెనుకంజవేయలేదు. ఓటర్లకు డబ్బుల పంపణీ, ఎన్నికల సంఘం అధికారులకు లంచం ఇవ్వజూపడం వంటి తప్పులు చేశారు. ఈ విషయం ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసుల విచారణలో వెల్లడైంది. 
 
బుధవారం ఢిల్లీ పోలీసుల కస్టడీలోకి వెళ్లిన దినకరన్ ఆరోజు అధికారులు అడిగిన ప్రశ్నలకు అడ్డదిడ్డంగా సమాధానాలు చెప్పారు. తాజాగా నిజాన్ని అంగీకరించిన ఆయన తన ప్లాన్‌‌ను వివరించారు. ఆర్కేనగర్ ఉప ఎన్నికలో గెలిచి ఆ తర్వాత ముఖ్యమంత్రి కావాలనుకున్నానని చెప్పినట్టు పోలీసు అధికారి ఒకరు తెలిపారు. 
 
రెండాకుల గుర్తు కోసం ఈసీకి ఇవ్వాలనుకున్న సొమ్ములో పది కోట్ల రూపాయలను స్నేహితుడు మల్లికార్జున్ ఏర్పాటు చేయగా మిగిలిన రూ.50 కోట్లను కొందరు వ్యాపారుల నుంచి ఇప్పిస్తానని మల్లికార్జున్ చెప్పినట్టు దినకరన్ వివరించారు. హవాలా మార్గంలో ఈ సొమ్మును అప్పగించేందుకు ఏర్పాటు కూడా జరిగినట్టు వివరించారు. ఇందుకు చాందినీ చౌక్‌కు చెందిన హవాలా డీలర్లు, కొచ్చికి చెందిన షేక్ ఫైజల్ అనే వ్యక్తి సహకరించినట్టు దినకరన్ తెలిపారు.