ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 28 ఏప్రియల్ 2017 (10:42 IST)

దినకరన్‌ కోసం ఐపీఎస్‌ల లాబీయింగ్.. ఉచ్చులో చిక్కనున్నారా?

రెండాకుల చిహ్నాన్ని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ఈసీకి లంచం ఇవ్వజూపిన కేసులో అన్నాడీఎంకే అమ్మ పార్టీ నేత టీటీవీ దినకరన్‌ను ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెల్సిందే. ఈ కేసులో దినక

రెండాకుల చిహ్నాన్ని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ఈసీకి లంచం ఇవ్వజూపిన కేసులో అన్నాడీఎంకే అమ్మ పార్టీ నేత టీటీవీ దినకరన్‌ను ఢిల్లీ క్రైమ్  బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెల్సిందే. ఈ కేసులో దినకరన్ చిక్కుకున్న వెంటనే ఆయనను తప్పించేందుకు రాష్ట్రానికి చెందిన ముగ్గురు ఐపీఎస్‌లు తమకు తెలిసిన వర్గాల ద్వారా ఆయనను తప్పించేందుకు లాబీయింగ్ చేసినట్టు సమాచారం. 
 
నాలుగు రోజుల పాటు దినకరన్‌‌ను విచారించడమే కాకుండా, ఆయన సెల్‌ఫోన్‌ను పరిశీలించిన క్రైం బ్రాంచ్ పోలీసులు ఈ విషయాన్ని గుర్తించారు. కోటి రూపాయలకు పైగా డబ్బుతో ఢిల్లీలో బ్రోకర్ సుఖేశ్ చంద్ర అరెస్టయిన తర్వాత దినకరన్ ముగ్గురు ఐపీఎస్ అధికారులతో మంతనాలు సాగించినట్టు గుర్తించారు. దినకరన్‌పై మూడు సెక్షన్ల కింద కేసులు నమోదు కావడంతో వాటి నుంచి ఎలా తప్పించుకోవాలో చెబుతూ దినకరన్‌కు వారు సలహా ఇచ్చినట్టు చెబుతున్నారు. 
 
అంతేకాదు, ఢిల్లీలో తమ పలుకుబడితో దినకరన్‌ను బయటపడేస్తామని హామీ కూడా ఇచ్చినట్టు సమాచారం. కేసు నుంచి బయటపడిన తర్వాత చేసిన సాయానికి ప్రతిఫలంగా తాము కోరుకున్న ప్రమోషన్లు ఇవ్వాలని లంకె పెట్టినట్టు తెలుస్తోంది. దినకరన్ కేసులో తాజాగా ఐపీఎస్‌ అధికారుల బాగోతం బయటపడడంతో వారిని కూడా విచారించాలని భావిస్తున్నట్టు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.