సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 30 జులై 2021 (19:14 IST)

బాలికపై లైంగిక దాడి చేస్తూ వీడియో, దాన్ని చూపించి మరో నలుగురు...

16 ఏళ్ల మైనర్ బాలికపై ఆమె స్నేహితుడు లైంగిక దాడి చేసాడు. ఆ సమయంలో ఆమె నగ్న వీడియోలను తీసి, ఆ తర్వాత ఆ వీడియోలను చూపించి పలుమార్లు అత్యాచారం చేసాడు.
 
ఆ వీడియోలను తన నలుగరు స్నేహితులకు షేర్ చేసాడు ఆ కామాంధుడు. దానితో ఆ వీడియోలను చూపించి బాలికపై ఆ నలుగురు కూడా అత్యాచారం చేసారు. గత ఆరు నెలలుగా ఆ బాలికను ఇలా వేధిస్తూ వచ్చారు. విషయాన్ని బయటకు చెబితే ఆ వీడియోలను నెట్లో పెడతామంటూ బెదిరించారు.
 
ఆ బెదిరింపులకు భయపడిన బాలిక ఆరు నెలలుగా భరిస్తూ వచ్చింది. చివరికి వారి వేధింపులు తీవ్రం కావడంతో విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. బాలికపై దారుణానికి పాల్పడ్డవారిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితులు ఐదుగురిని అరెస్టు చేశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జబల్‌పూర్‌లో జరిగింది.