మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 3 సెప్టెంబరు 2020 (13:12 IST)

సెల్ ఫోన్ కొనివ్వలేదని విద్యార్థిని ఆత్మహత్య.. ప్రియుడు కూడా చితిపై దూకి..?

క్షణికావేశాలు నేరాల సంఖ్య పెరిగిపోయేందుకు కారణం అవుతున్నాయి. చిన్న చిన్న కారణాలకే ప్రాణాలు తీసుకుంటున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. కరోనా కారణంగా ఆన్‌లైన్ తరగతులు జరుగుతున్న తరుణంలో.. తండ్రి సెల్‌ఫోన్ కొనివ్వలేదని డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె మరణాన్ని తట్టుకోలేని ఆమె ప్రియుడు చితిపై దూకి ఆత్మాహుతి చేసుకున్నాడు. తమిళనాడు రాష్ట్రం విల్లుపురంలో విషాదం చోటుచేసుకుంది.
 
ఆన్‌లైన్‌ క్లాసుల కోసం సెల్‌ఫోన్‌ కొనివ్వలేదని... డిగ్రీ విద్యార్థిని నిత్యశ్రీ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆర్థిక పరిస్థితి సరిగా లేనందున నిత్యశ్రీ తండ్రి ఫోన్‌ కొనివ్వలేకపోయినట్టు తెలుస్తోంది. కాగా.. నిత్యశ్రీ మరణాన్ని తట్టుకోలేకపోయిన ప్రియుడు రాము సైతం.. శ్మశానంలో ఆమె చితిపై పడి ఆత్మాహుతి చేసుకుని మరణించాడు. విల్లుపురం జిల్లా ఉలుందూరు పేటలో ఈ ఘటన చోటు చేసుకుంది.