శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 13 ఫిబ్రవరి 2017 (16:35 IST)

వ్యాపమ్ స్కామ్‌పై సుప్రీం కోర్టు సంచలన తీర్పు: 2008-12లో ఎంబీబీఎస్ అడ్మిషన్లు చెల్లవ్!

వ్యాపమ్ స్కామ్‌పై సుప్రీం కోర్టు సంచలన తీర్పును ఇచ్చింది. మధ్యప్రదేశ్‌లో అక్రమ పద్ధతితో వ్యాపమ్ ప్రీ మెడికల్ పరీక్షను రాసి ముడుపులు చెల్లించి పెద్దమొత్తంలో వైద్య సీట్లు పొందారనే ఆరోపణలు వచ్చాయి. ఈ వ్య

వ్యాపమ్ స్కామ్‌పై సుప్రీం కోర్టు సంచలన తీర్పును ఇచ్చింది. మధ్యప్రదేశ్‌లో అక్రమ పద్ధతితో వ్యాపమ్ ప్రీ మెడికల్ పరీక్షను రాసి ముడుపులు చెల్లించి పెద్దమొత్తంలో వైద్య సీట్లు పొందారనే ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వ్యాపం కేసుపై సుప్రీం కోర్టు అనూహ్య తీర్పును ఇచ్చింది. 
 
2008 నుంచి 2012 మధ్య ఎంబీబీఎస్‌లో చేరినవారి అడ్మిషన్లు చెల్లుబాటుకావంటూ సంచలన తీర్పునిచ్చింది. సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ జగదీశ్‌ సింగ్‌ ఖేహర్‌‌తో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెల్లడించింది. దీంతో దాదాపు 600 మంది విద్యార్థులపై ఈ తీర్పు ప్రభావం పడనుంది. అదే సమయంలో విద్యార్థులు వేసిన పిటిషన్లు కూడా సుప్రీంకోర్టు కొట్టివేసింది. తద్వారా కొత్తగా పునర్విచారణ పిటిషన్లకు దాదాపు అవకాశం ఉండదని తెలుస్తోంది.