మంగళవారం, 31 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 27 జూన్ 2017 (09:17 IST)

తమన్నా అంత పని చేసిందా? గర్భిణీపై కత్తితో దాడి

తమన్నా గర్భిణీపై కత్తితో దాడి చేసింది. కత్తిపోట్లకు గురైన ఆ గర్భిణీ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. దీంతో తమన్నాపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు. ఇంతకీ.. తమన్నా ఏంటీ.. గర్భిణీపై కత్తితో దాడి చేయడం ఏంట

తమన్నా గర్భిణీపై కత్తితో దాడి చేసింది. కత్తిపోట్లకు గురైన ఆ గర్భిణీ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. దీంతో తమన్నాపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు. ఇంతకీ.. తమన్నా ఏంటీ.. గర్భిణీపై కత్తితో దాడి చేయడం ఏంటనే కదా మీ సందేహం... అయితే, ఈ కథనం చదవండి. 
 
మహారాష్ట్రలోని భీవాండి నగరంలోని ధామన్‌కర్‌నాకా ప్రాంతంలో జావెద్, అస్మాఅన్సారీ అలియాస్ తమన్నాలు అనే దంపతులు నివశిస్తున్నారు. అయితే, జావెద్‌కు అదే ప్రాంతంలో ఉన్న ఓ మహిళ (గర్భిణీ)తో వివాహేతర సంబంధం ఉందని తమన్నా పసిగట్టింది. ఇదే విషయంపై వారి మధ్య తరచూ గొడవలూ జరుగుతూ ఉన్నాయి. 
 
ఈనేపథ్యంలో భర్త వివాహేతర సంబంధంపై ఆదివారం రాత్రి కూడా తమన్నా గొడవపడింది. మరుసటి రోజు గర్భిణీతో తన భర్త ఉన్నాడని తెలుసుకున్న తమన్నా కత్తి వెంట తీసుకొని వెళ్లింది. గర్భిణీతో తన భర్త ఉండటం చూసి ఆగ్రహంతో గర్భిణీపై కత్తితో దాడి చేసి పొడిచింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన గర్భిణీని జేజే ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. గర్భిణీపై హత్యాయత్నం చేసిన తమన్నాపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.