గురువారం, 9 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. దసరా
Written By chj
Last Modified: మంగళవారం, 4 అక్టోబరు 2016 (13:09 IST)

నవరాత్రి స్పెషల్... శ్రీ అన్నపూర్ణేశ్వరి దేవి అలంకారం(04-10-2016)-Video

దసరా ఉత్సవాలలో ఆశ్వయుజ తదియ నాడు అమ్మవారిని శ్రీ అన్నపూర్ణాదేవిగా అలంకరిస్తారు. వారణాసి క్షేత్రాన్ని నిజ క్షేత్రంగా, క్షేత్ర అధినాయకుడు విశ్వేశ్వరుడి ప్రియపత్నిగా శ్రీ అన్నపూర్ణాదేవి విరాజిల్లుతుంది. అన్నం జీవుల మనుగడకు ఆధారం. అందుకే అన్నం పరబ్రహ్మ స

దసరా ఉత్సవాలలో ఆశ్వయుజ తదియ నాడు అమ్మవారిని శ్రీ అన్నపూర్ణాదేవిగా అలంకరిస్తారు. వారణాసి క్షేత్రాన్ని నిజ క్షేత్రంగా, క్షేత్ర అధినాయకుడు విశ్వేశ్వరుడి ప్రియపత్నిగా శ్రీ అన్నపూర్ణాదేవి విరాజిల్లుతుంది. అన్నం జీవుల మనుగడకు ఆధారం. అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. ఆదిభిక్షువైన ఈశ్వరునికి భిక్ష పెట్టిన దేవత అయిన అన్నపూర్ణదేవిని పూజిస్తే మేథాశక్తి వృద్ధి చెందుతుంది. మధురభాషణ, సమయస్ఫూర్తి, వాక్ శుద్ధి, ఐశ్వర్యాలు కలుగుతాయి. 
 
మానవుడిని సకల సంపూర్ణునిగా అన్నపూర్ణదేవి అనుగ్రహిస్తుంది. సమస్త జీవరాశులకు ఆహారాన్ని అందించే అమ్మవారిని అన్నపూర్ణ రూపంలో దర్శించుకుని, పూజిస్తే ఆకలిదప్పుల వంటి బాధలు ఉండవు. అమ్మ ధరించిన రసపాత్ర అక్షయ శుభాలను అందిస్తుంది. అన్నపూర్ణ దేవిని తెల్లని పుష్పాలతో పూజించాలి. "హ్రీం శ్రీం క్లీం ఓం నమో భాగవత్యన్నపూర్ణేశ మమాభిలాషిత మహిదేవ్యన్నం స్వాహా" అనే మంత్రాన్ని జపించాలి. అన్నపూర్ణ అష్టోత్తరము - స్తోత్రములు చదివి, పొంగలిని నైవేద్యంగా నివేదించాలి. కాశీ అన్నపూర్ణేశ్వరి స్తోత్రము యూ ట్యూబ్ నుంచి....