శ్రీ గాయత్రీ దేవి అలంకారం(03-10-2016), ఐదు ముఖాలతో అమ్మ(Video)
శరన్నవరాత్రులలో మూడవ రోజైన ఆశ్వయుజ శుద్ధ విదియ నాడు అమ్మ గాయత్రీ దేవిగా దర్శనమిస్తుంది. సకల వేద స్వరూపం గాయత్రీ దేవి. అన్ని మంత్రాలకు మూలశక్తి గాయత్రీ దేవి అమ్మవారే. సకల మంత్రాలకు మూలశక్తి అయిన గాయత్రీ దేవి రూపంలో అమ్మను ఆరాధిస్తే అనంత మంత్రశక్తి, బ
ముక్తా విద్రుమ హేమనీల ధవళచ్ఛాయై ర్ముఖై స్త్రీక్షణైః
ర్యుక్తామిందు నిబద్దరత్నమకుటాం తత్వార్థ వర్ణాత్మికాం
గాయత్రీం వరదాభయాంకుశకశాశ్శుభ్రం కపాలం గదాం
శంఖం చక్రమధార వింద యుగళం హస్తైర్వహం తీం భజే
శరన్నవరాత్రులలో మూడవ రోజైన ఆశ్వయుజ శుద్ధ విదియ నాడు అమ్మ గాయత్రీ దేవిగా దర్శనమిస్తుంది. సకల వేద స్వరూపం గాయత్రీ దేవి. అన్ని మంత్రాలకు మూలశక్తి గాయత్రీ దేవి అమ్మవారే. సకల మంత్రాలకు మూలశక్తి అయిన గాయత్రీ దేవి రూపంలో అమ్మను ఆరాధిస్తే అనంత మంత్రశక్తి, బ్రహ్మజ్ఞానం కలుగుతాయని చెబుతారు. ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళ వర్ణాలు కలిగిన ఐదు ముఖాలతో శంఖం, చక్ర, గద, అంకుశం ధరించి దర్శనమిస్తుంది.
ఆదిశంకరులు గాయత్రీదేవిని అనంత శక్తి స్వరూపముగా అర్చించారు. ప్రాతఃకాలములో గాయత్రిగానూ, మధ్యాహ్న కాలములో సావిత్రిగాను, సాయం సంధ్యలో సరస్వతిగానూ ఈమె ఉపాసకులతో ఆరాధనలు అందుకుంటుంది. ముఖములో అగ్ని, శిరస్సులో బ్రహ్మ, హృదయములో విష్ణువు, శిఖపై రుద్రుడు కొలువుంటారని పురాణములు చెబుతున్నాయి. గాయత్రీ ఉపాసన వలన బుద్ధి తేజోవంతము అవుతుంది. గాయత్రీ మంత్ర జపము చతుర్వేద పారాయణ ఫలితాన్ని ఇస్తుంది. గాయత్రీ స్తోత్రములు పారాయణ చేసి రవ్వ కేసరి, పులిహోర నైవేద్యంగా సమర్పించాలి. గాయత్రీ మంత్రం యూ ట్యూబ్ నుంచి వీడియో... చూడండి...