సోమవారం, 27 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. దసరా
Written By JSK
Last Modified: శనివారం, 8 అక్టోబరు 2016 (18:25 IST)

మూలా న‌క్ష‌తం నాడు పూజిస్తే... వాగ్దేవి మీ నాలుక‌పై న‌ర్తిస్తుంది...

చ‌దువుల తల్లి సరస్వతీదేవి కటాక్షం ఉంటే సకల శుభాలు కలుగుతాయని భక్తుల విస్వాసం .. కనకదుర్గ అమ్మవారి జన్మ నక్షత్రం మూలా నక్షత్రం ఎంతో విశేషమైనది. దసరా వేడుకల్లో మూలా నక్షత్రం రోజున భక్తులు తండోప తండాలుగా తరలివస్తారు. శనివారం దుర్గమ్మ తల్లి సరస్వతీ దే

యాకుందేందు తుషారాహా రదవలా యాశు బ్రవశ్రాన్వితా !!
యా వీణా వరదండ మండితాకార యా శ్వే త పద్మాసనా!! 
బ్రమ్మచ్యుత శంకర ప్రభుతివీర్ దైవస్సదా పూజిత
సామాంపాతు సరస్వతీ భగవతీ నిశేష జాడ్యాపహా !!
 
చ‌దువుల తల్లి సరస్వతీదేవి కటాక్షం ఉంటే సకల శుభాలు కలుగుతాయని భక్తుల విస్వాసం .. కనకదుర్గ అమ్మవారి జన్మ నక్షత్రం మూలా నక్షత్రం  ఎంతో విశేషమైనది. దసరా వేడుకల్లో మూలా నక్షత్రం  రోజున భక్తులు తండోప తండాలుగా తరలివస్తారు. శనివారం దుర్గమ్మ తల్లి సరస్వతీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. మహాకాళి, మహాలక్ష్మి , మహా సరస్వతిగా  త్రిశక్తి స్వరూపిణి అయిన దుర్గాదేవి తన అంశంలోని నిజస్వరూపాన్ని సాక్షాత్కరించడమే మూలా నక్షత్రం రోజు చేసే అలంకారం ప్రత్యేకత. 
 
చింతామణి, జ్ఞాన, నీల, ఘట, కిణి , అంతరిక్ష మహా సరస్వతులుగా సప్తనామాలతో వాగ్దేవి ప్రాణుల నాలుకపై నర్తించే బుద్ధి ప్రదా యినిగా విరాజిల్లుతుంది. బ్రహ్మ చైతన్య సవరూపిణిగా పురాణాలు వర్ణిస్తున్నాయి. శ్వేతాపద్మాన్ని ఆసనంగా అధిష్టించి వీణ , దండ , కమండలం , అక్షమాల ధరంచి నెమలితో కూడి అభయముద్ర ధరంచి భక్తుల అజ్ఞాన తిమిరాలను ఈ దేవి సంహరిస్తుంది. 
 
వ్యాసుడు , వాల్మీకి, కాళిదాసు, మొదలైన లోకోత్తర చరిత్రలకు ఈమె వాగ్వా వైభవాన్ని ఇచ్చింది. ఈమెను కొలిస్తే విద్యార్థులకు బుద్ధి వికాసం జరుగుతుంది. సంగీత, సాహిత్యా లకు అదిష్టానదేవత. సకల  జీవుల జిహ్మాగ్రంపై ఈమె నివాసం ఉంటుంది. త్రిశక్తి స్వరూపాల్లో మూడవ శక్తి రూపం సరస్వతీదేవి అమ్మవారు. ప్రభుత్వ లాంఛనాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు అమ్మవారికి పట్టువస్త్రాలు  సమర్పించారు.