1. ఇతరాలు
  2. వంటకాలు
  3. మాంసాహారం
  4. Weekend special -prawn pakodi

వీకెండ్ స్పెషల్ : ప్రాన్ పకోడి!

Weekend special -prawn pakodi
ప్రాన్.. రొయ్యల్లో అధిక కొవ్వుతో పాటు అధిక కెలోరీలు ఉన్నాయి. అయితే ఇవి శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను కంట్రోల్ చేస్తాయి. తద్వారా గుండెపోటును దూరం చేసుకోవచ్చు. అంతేగాకుండా ప్రాన్స్‌లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్, క్యాల్షియం, విటమిన్ ఇ పుష్కలంగా ఉన్నాయి. అందుచేత ఆరోగ్యమైన చర్మంతో పాటు దంతాలు, ఎముకల వృద్ధికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. పిల్లల శరీర ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడతాయి. అలాంటి ప్రాన్‌‌తో ఈ వీకెండ్ పకోడీలు ట్రై చేద్దాం.. 
 
ఎలా చేయాలంటే.. 
కావలసిన పదార్థాలు : 
రొయ్యలు (పెద్దవి) : అరకేజీ 
నూనె - తగినంత 
పిండి తయారీకి : 
శనగపిండి - ఒక కప్పు 
బేకింగ్ సోడా - చిటికెడు 
ఉప్పు - తగినంత 
ఛీజ్ తురుము - రెండు టేబుల్ స్పూన్
 
నానబెట్టేందుకు.. నూనె, రుచికి తగిన ఉప్పు, వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం, వెనిగర్‌, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర ఒక్కో టీ స్పూన్. 
 
తయారీ విధానం :
రొయ్యలు శుభ్రంగా కడిగి మసాలాలు పట్టించి పది నిమిషాల పాటు నానబెట్టాలి. శనగపిండిని సిద్ధం చేసుకుని.. నానబెట్టిన మసాలాతో కూడిన రొయ్యల్ని పిండిలో ముంచి నూనెలో వేసి వేయించాలి. టొమేటో సాస్ నంజుకుని తింటే రొయ్యల పకోడీ చాలా టేస్ట్‌గా ఉంటాయి. వీటిని పిల్లలు తెగ ఇష్టపడి తింటారు. 
 
About Writer
Selvi