బుధవారం, 6 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By Raman
Last Updated : గురువారం, 29 మార్చి 2018 (08:58 IST)

29-03-2018 గురువారం మీ రాశి ఫలితాలు.. బంధువులకు ధన సహాయం చేస్తే?

మేషం: విదేశాలకు వెళ్లేందుకు చేయు ప్రయత్నాలు వాయిదాపడతాయి. స్త్రీలకు షాపింగ్‌ల్లోను, వస్తు నాణ్యత ఎంపికలోను ఏకాగ్రత అవసరం. ఆడిట్, అక్కౌంట్స్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికంగా ఉంటుంది. దైవ, సేవాకార్

మేషం: విదేశాలకు వెళ్లేందుకు చేయు ప్రయత్నాలు వాయిదాపడతాయి. స్త్రీలకు షాపింగ్‌ల్లోను, వస్తు నాణ్యత ఎంపికలోను ఏకాగ్రత అవసరం. ఆడిట్, అక్కౌంట్స్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికంగా ఉంటుంది. దైవ, సేవాకార్యాల పట్ల ఆకర్షితులవుతారు. ధనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు.
 
వృషభం: కోర్టు వ్యాజ్యాలు, కేసులు ఉపసంహరించుకుంటారు. వ్యాపారాల్లో ఆటుపోటులు తొలగి లాభాలు గడిస్తారు. బంధువులకు ధన సహాయం చేయడం వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఉద్యోగస్తుల ప్రమోషన్‌కు కొంతమంది ఆటంకాలు కలిగిస్తారు. బ్యాంకు వ్యవహారాలు, ప్రయాణాల్లో ఏకాగ్రత వహించండి. 
 
మిథునం: ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. సోదరీ, సోదరులు సన్నిహితులతో ప్రయాణాలు ఉల్లాసం కలిగిస్తాయి. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ప్లీడరు ప్లీడరు గుమస్తాలకు ప్రోత్సాహం కానరాగలదు. నూనె మిర్చి, కంది వ్యాపారస్తులకు, స్టాకిస్టులకు పురోభివృద్ధి. 
 
కర్కాటకం: కాంట్రాక్టర్లు, నూతన కాంట్రాక్టులు చేజిక్కించుకుంటారు. ఉపాధ్యాయులకు యాజమాన్యం ఒత్తిడి అధికమవుతుంది. రాజకీయాల్లో వారికి గుర్తింపుతో పాటు చికాకులు కూడా అధికం. సొంతంగా ఏదైనా వ్యాపారం చేయాలనే మీ ఆలోచన వాయిదా వేయడం మంచిది. పాత మొండి బాకీలు వసూలు కాగలవు. 
 
సింహం: వ్యవసాయ, తోటల రంగాల్లో వారికి లాభదాయకం. కుటుంబీకుల మధ్య పరస్పర అవగాహన లోపం, చికాకులు అధికమవుతాయి. మిత్రుల కారణంగా మీ కార్యక్రమాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. శ్రీవారు, శ్రీమతి వైఖరి ఉల్లాసం కలిగిస్తుంది. ఉపాధ్యాయులకు, మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి, అధికమవుతుంది. 
 
కన్య: మీ శ్రమను దుర్వినియోగం చేయకండి. బంధువుల నుంచి ఒత్తిడి, మొహమ్మాటాలు ఎదుర్కొంటారు. శాస్త్ర రంగాల వారికి పరిశోధనలు ప్రయోగాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. కీలకమైన సమస్యలు పరిష్కారం కావడంతో మీలో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. పత్రికా సంస్థల్లోని వారికి ఊహించని సమస్యలెదురవుతాయి.
 
తుల: రవాణా, న్యాయ, ప్రకటనలు, విద్యారంగాల వారికి శుభప్రదం. ఒకానొక సందర్భంలో మీ ఆవేశపూరిత నిర్ణయాలు ఇబ్బందులకు దారితీస్తాయి. ఉపాధ్యాయులకు మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి అధికమవుతాయి. సంఘంలో మంచి పేరు, ఖ్యాతి గడిస్తారు. పాత వస్తువుల వల్ల ఇబ్బందులు తలెత్తుతాయి.
 
వృశ్చికం: అందివచ్చిన అవకాశం చేజారినా మంచికేనని భావించండి. ఉపాధ్యాయులకు, మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి తప్పదు. పెంపుడు జంతువుల గురించి ఆందోళన చెందుతారు. ప్రయాణాలు ఆకస్మికంగా వాయిదా వేస్తారు. నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షల్లో ఏకాగ్రత ముఖ్యం. 
 
ధనస్సు: రావలసిన బకాయిల విషయంలో శ్రద్ధ వహించండి. పుణ్యక్షేత్రాలు, కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు. బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కొనవలసివస్తుంది. కొబ్బరి, పండ్ల, పూల, కూరగాయల వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. క్రయ విక్రయాల విషయంలో శ్రేయోభిలాషుల సలహా పాటించడం మంచిది. 
 
మకరం: బంధువర్గాల నుంచి వ్యతిరేకత, విమర్శలు ఎదుర్కొంటారు. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. మీ సంతానంతో ఉల్లాసంగా గడుపుతారు. ప్రైవేట్ సంస్థల్లోని వారికి యాజమాన్యంతో ఏకీభావం లోపిస్తుంది. దృఢ సంకల్పంతో ముందుకు సాగండి. కాంట్రాక్టర్లకు పనివారలతో సమస్యలు అధికమవుతాయి.
 
కుంభం: ఏజెన్సీలు, లీజు, గడువు పొడిగింపులకు అనుకూలం. తోటివారి ఉన్నతస్థాయితో పోల్చుకోవడం క్షేమం కాదు. విద్యార్థినుల్లో ఏకాగ్రత, స్థిరత్వం నెలకొంటాయి. బంధువుల రాక వల్ల పనులు అర్థాంతంగా ముగించవలసి వస్తుంది. ఏజెన్సీ, లీజు, నూతన కాంట్రాక్టులకు సంబంధించి కొన్ని ప్రతికూలతలెదురవుతాయి.
 
మీనం: ఆధ్యాత్మిక విషయాలు, దానధర్మాలకు ఖర్చులు చేస్తారు. బంధువుల రాకతో కొంత అసౌకర్యానికి గురవుతారు. మీ సంతానంతో ఉల్లాసంగా గడుపుతారు. శత్రువులపై విజయం సాధిస్తారు. పాత రుణాలు తీర్చి తాకట్టు వస్తువులను విడిపిస్తారు. వస్త్ర, బంగారు, వెండి, లోహ వ్యాపారస్తులకు శుభదాయకం.