శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By raman
Last Updated : ఆదివారం, 25 మార్చి 2018 (08:13 IST)

25-03-2018 ఆదివారం మీ రాశి ఫలితాలు... స్త్రీలకు విదేశీ వస్తువులపై..?

మేషం: బంధుమిత్రులతో కలసి విందు, వినోదాలలో పాల్గొంటారు. ఉద్యగస్తులు విశ్రాంతికై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబీకులతో ఏకీభవించలేకపోతారు. దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కార మార్గం గోచరిస్తుంది. కిరాణా, ఫ్యా

మేషం: బంధుమిత్రులతో కలసి విందు, వినోదాలలో పాల్గొంటారు. ఉద్యగస్తులు విశ్రాంతికై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబీకులతో ఏకీభవించలేకపోతారు. దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కార మార్గం గోచరిస్తుంది. కిరాణా, ఫ్యాన్సీ రంగాల్లో వారికి కలిసిరాగలదు. నిరుద్యోగులకు అవకాశాలు కొన్ని తృటిలో తప్పిపోతాయి. 
 
వృషభం : ద్విచక్ర వాహనంపై దూరప్రయాణాలు మంచిది కాదు. స్త్రీలకు పనివారలతో చికాకులు తప్పవు. ధన సహాయం, హామీలకు దూరంగా వుండటం మంచిది. ఆలయాలను సందర్శిస్తారు. మీ వాహనం ఇతరులకిచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. స్వయంకృషితో రాణిస్తారన్న విషయం గ్రహించండి.
 
మిథునం: వ్యవసాయ, తోటల రంగాల్లో వారికి సంతృప్తి, పురోభివృద్ధి కానవస్తుంది. స్త్రీలకు వ్యాపకాలు, పరిచయాలు విస్తరిస్తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరించండి. ఆరోగ్యం, ఆహార విషయంలో మెళకువ అవసరం. 
 
కర్కాటకం: కొబ్బరి, పండ్ల, పూల, కూరగాయల వ్యాపారులకు లాభదాయకంగా వుంటుంది. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తినిస్తాయి. పాత మిత్రుల కలయికతో గత అనుభవాలు జ్ఞప్తికి వస్తాయి.  మత్స్య, కోళ్ల వ్యాపారస్తులకు కలిసివస్తుంది. విద్యుత్, ఏసీ కూలర్లు, మెకానికల్ రంగాల్లో వారికి పనిభారం అధికం. 
 
సింహం : ఆర్థిక విషయాల్లో సంతృప్తి కానరాదు. స్థిరాస్తి కొనుగోలు చేయాలనే మీ ఆలోచన కార్యరూపం దాల్చుతుంది. భాగస్వామికులతో కొత్త విషయాలు చర్చకు వస్తాయి. మత్స్య కోళ్ల వ్యాపారస్తులకు కలిసిరాగలదు. స్త్రీలతో మితంగా సంభాషించడం క్షేమదాయకం. రాజకీయ నాయకులకు ప్రయాణాల్లో మెళకువ అవసరం. 
 
కన్య: వాతావరణంలో మార్పు పనులకు ఆటంకమవుతుంది. పత్రికా సంస్థల్లోని వారికి చిన్న చిన్న పొరపాట్లు  దొర్లే ఆస్కారం వుంది. స్త్రీలకు విదేశీ వస్తువులపై ఆకర్షితులవుతారు. ప్రముఖులను కలుసుకుంటారు. ఊహించని ఖర్చులు వల్ల స్వల్ప ఇబ్బందులు తప్పవు. ఉపాధ్యాయులు విశ్రాంతికై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. 
 
తుల : మీ ఇష్టాయిష్టాలను సున్నితంగా వ్యక్తం చేయండి. ఉద్యోగస్తులు విశ్రాంతికై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకం. రాజకీయనాయకులకు ప్రయాణాల్లో అపరిచిత వ్యక్తులతో మెళకువ అవసరం. ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. చిన్నారులకు విలువైన కానుకలు చదివించుకుంటారు.
 
వృశ్చికం: ఆత్మీయులు, చిన్నారులకు విలువైన కానుకలు చదివించుకుంటారు. ఎవరికైనా ధన సహాయం చేసినా తిరిగి రాజాలదు. రాజకీయాల వారికి పార్టీ పరంగా గుర్తింపు లభిస్తుంది. ఇతరులను మీ విషయాల్లో జోక్యం చేసుకోనివ్వకండి. పెరిగిన ధరలు, ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. ఇంటర్వ్యూలలో జయం పొందుతారు. 
 
ధనస్సు: శారీరక శ్రమ వల్ల ఆరోగ్యంలో సంతృప్తి కానరాదు. విజ్ఞతాయుతంగా వ్యవహరించి మీ గౌరవాన్ని కాపాడుకోండి. అనుక్షణం మీ సంతానం విద్యా, ఉద్యోగ విషయాలపైనే మీ ఆలోచనలుంటాయి. సన్నిహితులతో కలిసి విందు, వినోదాల్లో పాల్గొంటారు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులు ఎదుర్కొంటారు. 
 
మకరం: ఆర్థిక లావాదేవీలు, కుటుంబ వ్యవహారాలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. మీ శ్రీమతి ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకూడదు. దైవ, పుణ్య, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రయాణాల్లో అసౌకర్యానికి లోనవుతారు. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. సాహస ప్రయత్నాలు విరమించండి.  
 
కుంభం: బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. మీ బలహీనతలు, అలవాట్లు అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. ఒక కార్యం నిమిత్తం ఆకస్మికంగా ప్రయాణం చేయాల్సివస్తుంది. సోదరీ సోదరుల మధ్య వివాదాలు తలెత్తుతాయి. మీ సంతానం విద్య, వివాహ విషయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. 
 
మీనం: మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి, శ్రమాధిక్యత తప్పదు. ప్రియమైన వ్యక్తుల కలయికతో మానసికంగా కుదుటపడతారు. ధనం ఏమాత్రం నిల్వ చేయకపోవడం వల్ల ఆందోళనకు గురవుతారు. దైనందిన కార్యక్రమాల్లో స్వల్పమార్పులు చోటుచేసుకుంటాయి. బంధువుల ఆకస్మిక రాక అసహనం కలిగిస్తుంది.