1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By Raman
Last Updated : సోమవారం, 26 మార్చి 2018 (07:07 IST)

26-03-2018 సోమవారం మీ రాశి ఫలితాలు.. రాబడికి మించి ఖర్చులు అధికం

మేషం: ఆర్థిక లావాదేవీలు, కీలకమైన సమస్యలు సమర్థవంతంగా పరిష్కరిస్తారు. ఏ పని మొదలెట్టినా మధ్యలో వదిలేయకుండా పూర్తి చేయండి. ఖర్చులు పెరగడంతో పాటు రుణాలు, చేబదుళ్ళు తప్పవు. ప్రియతముల రాక సమాచారం మీకు ఎంతో

మేషం: ఆర్థిక లావాదేవీలు, కీలకమైన సమస్యలు సమర్థవంతంగా పరిష్కరిస్తారు. ఏ పని మొదలెట్టినా మధ్యలో వదిలేయకుండా పూర్తి చేయండి. ఖర్చులు పెరగడంతో పాటు రుణాలు, చేబదుళ్ళు తప్పవు. ప్రియతముల రాక సమాచారం మీకు ఎంతో ఆనందాన్నిస్తుంది. సిమెంట్ స్టాకిస్టులకు, వ్యాపారులకు పురోభివృద్ధి కానవస్తుంది. 
 
వృషభం: గృహ నిర్మాణాలు, మరమ్మతులు మందకొడిగా సాగుతాయి. ఉపాధ్యాయులకు మార్పులు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులు ప్రలోభాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. పెద్దలతో సోదరుల విషయాలు చర్చకు వస్తాయి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబీకుల మధ్య కొత్త కొత్త విషయాలు చర్చకు వస్తాయి. 
 
మిథునం: రాబడికి మించి ఖర్చులు అధికమవుతాయి. రియల్ ఎస్టేట్, బ్రోకర్లకు, వ్యాపారస్తులకు పనివారితో  చికాకులు తప్పవు. సంఘంలో మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. నూతన పెట్టుబడులు, జాయింట్ వెంచర్లకు అనుకూలం. వ్యాపారుల ఆలోచనలు దస్త్రం దిశగా సాగుతాయి. పాతమిత్రుల కలయిక ఎంతో సంతృప్తినిస్తుంది.
 
కర్కాటకం: చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో పూర్తి చేయాల్సి వుంటుంది. విదేశాల్లోని ఆత్మీయుల రాక సంతోషం కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. దంపతుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. 
 
సింహం : వృత్తుల వారికి గుర్తింపు, ప్రజా సంబంధాలు బలపడతాయి. స్త్రీలకు అకాల భోజనం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. ఏ విషయం పైనా మనస్సు లగ్నం చేయలేరు. మీ ప్రమేయం లేకున్నా మాటపడవలసి వస్తుంది. దూర ప్రయాణాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటారు. సన్మానాలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
కన్య: పత్రికా సిబ్బందికి ఏకాగ్రత, పునఃపరిశీలన ముఖ్యం. పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు. కొంతమొత్తం సాయం చేసి వారిని సంతృప్తిపరచండి. ప్రయత్నపూర్వకంగా కొన్ని అవకాశాలు కలిసివస్తాయి. స్త్రీల ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. వాహనచోదకులకు చికాకులు అధికమవుతాయి. 
 
తుల: వృత్తి వ్యాపారాల్లో లక్ష్యాలు సాధిస్తారు. ఒక కార్యార్థమై దూర ప్రయాణం చేయాల్సి వస్తుంది. మీ జీవితభాగస్వామి ఆరోగ్యం దెబ్బతినడంతో మానసికంగా ఆందోళన చెందుతారు. బంధువుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. ఇతరులపై ఆధారపడక ప్రతి విషయంలోను మీరే నిర్ణయం తీసుకోవడం మంచిది. 
 
వృశ్చికం : ప్లీడర్లకు, ప్లీడరు గుమస్తాలకు సామాన్యం. ఉద్యోగస్తులకు అధికారుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. స్త్రీల ఆంతరంగిక వ్యవహారాలు బయటకు వ్యక్తం చేయడం వల్ల ఇబ్బందులు తప్పవు. ధనం ఏమాత్రం నిల్వ చేయకలేకపోవడం వల్ల ఆందోళనకు గురవుతారు. కాంట్రాక్టర్లకు నూతన టెండర్లు అనుకూలిస్తాయి.
 
ధనస్సు : మీ భార్య మొండివైఖరి వల్ల మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. మార్కెట్ రంగాల వారికి నిరుద్యోగులకు సదవకాశాలు లభిస్తాయి. ఉపాధ్యాయులకు బరువు, బాధ్యతలు అధికమవుతాయి. మొండి బాకీలు వసూలవుతాయి. రాజకీయ రంగాల వారు కార్యకర్తల వల్ల సమస్యలను ఎదర్కోక తప్పదు. డాక్టర్లకు నిరుత్సాహం కానవస్తుంది. 
 
మకరం: ఆస్తి పంపకాల్లో సోదరుల మధ్య ఏకీభావం నెలకొంటుంది. ఇతరులు మీ పట్ల ఆకర్షితులౌతారు. అనుకున్నవి సాధించి, ఎనలేని తృప్తిని పొందుతారు. పాత జ్ఞాపకాల గురించి మీ మిత్రులతో చర్చించడంలో ఉల్లాసాన్ని పొందుతారు. కోర్టు వ్యవహారాల్లో ప్లీడరు, ప్లీడరు గుమాస్తాలకు ఊహించని చికాకులు ఎదురవుతాయి.
 
కుంభం: ఆర్థిక  విషయాల్లో ఒకడుగు ముందుకు వేస్తారు. చీటికి, మాటికి ఎదుటివారిపై అసహనం, ఆగ్రహం వ్యక్తం చేస్తారు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి సంతృప్తి, పురోభివృద్ధి. ఒక అవసరానికి ఉంచిన ధనం మరో ఖర్చుకు వినియోగించుకోవాల్సి వస్తుంది. ఎల్ఐసి పోస్టల్ ఏజెంట్లు టార్గెట్లను పూర్తి చేయగలుగుతారు. 
 
మీనం: వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. స్త్రీలకు తల, కాళ్లు, నరాలు, ఎముకలకి సంబంధించిన చికాకులు ఎదుర్కొనక తప్పదు. ఖర్చులు మీ అంచనాలను మించడంతో ఒకింత ఇబ్బందులు తప్పవు. ప్రముఖుల ప్రమేయంతో ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు సానుకూలమవుతాయి.