శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By raman
Last Updated : బుధవారం, 28 మార్చి 2018 (10:24 IST)

బుధవారం (28-03-18) దినఫలాలు : విద్యార్థులు తోటివారితో.. (Video)

మేషం: విద్యార్థులు తోటివారితో మితంగా వ్యవహరించడం క్షేమదాయకం. బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. ప్రముఖులను కలుసుకుంటారు. మీ అభివృద్ధికి మంచి మంచి అవకాశాలు లభిస్తాయి. కొన్ని వి

మేషం: విద్యార్థులు తోటివారితో మితంగా వ్యవహరించడం క్షేమదాయకం. బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. ప్రముఖులను కలుసుకుంటారు. మీ అభివృద్ధికి మంచి మంచి అవకాశాలు లభిస్తాయి. కొన్ని విషయాలు మరిచిపోదామనుకున్నా సాధ్యంకాదు. ఒక పుణ్యక్షేత్రం సందర్శించాలనే కోరిక నెరవేరుతుంది.
 
వృషభం: చిన్ననాటి వ్యక్తుల కలయికతో గత అనుభవాలు జ్ఞప్తికి వస్తాయి. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటిపైనే శ్రద్ధ వహించండి. భాగస్వామిక సమావేశాల్లో కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. కోర్టు వాదోపవాదాల్లో ప్లీడర్లకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఉపాధ్యాయుల శ్రమకు మంచి గుర్తింపు లభిస్తుంది. 
 
మిథునం: రాజకీయ నాయకులు కొంత సంక్షోభం ఎదుర్కొనకతప్పదు. ఎవరినీ అతిగా విశ్వసించడం మంచిది కాదు. హోటల్, కేటరింగ్ రంగాల్లోవారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఉపాధ్యాయులకు, విద్యార్థులకు ఒత్తిడి, ఆందోళనలు అధికంగా వుంటాయి. అవివాహితుల ఆలోచనలు పలు విధాలుగా వుంటాయి. 
 
కర్కాటకం: గృహ నిర్మాణాలు, మరమ్మతులు మందకొడిగా సాగుతాయి. స్త్రీలకు ఏ విషయంలోనూ ఆసక్తి పెద్దగా ఉండదు. కోర్టు వ్యవహారాలు ఒక కొలిక్కి వచ్చే సూచనలున్నాయి. కంప్యూటర్ రంగాల వారికి చికాకులు తప్పవు. వృత్తిరీత్యా ప్రముఖులను కలుసుకుంటారు. దైవసేవా కార్యక్రమాలకు ధనం అధికంగా వెచ్చిస్తారు. 
 
సింహం: బంధువులు, సోదరుల మధ్య సత్సంబంధాలు నెలకొంటాయి. దీర్ఘకాలికంగా వాయిదా పడుతూ వస్తున్న పనులు పూర్తవుతాయి. రాజకీయాల్లో వారికి అనుకోని మార్పు కానరాగలదు. కొబ్బరి, పండ్ల, పానీయ వ్యాపారస్తులకు పురోభివృద్ధి. వాహనచోదకులకు ఏకాగ్రత ముఖ్యం. ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు. 
 
కన్య: మీ కళత్ర వైఖరి మీకు చికాకుకు కలిగించగలదు. ఉద్యోగస్తులు పై అధికారులతో సంభాషించునప్పుడు జాగ్రత్త వహించండి. బంధువులను కలుసుకుంటారు. మీ పనులు కార్యక్రమాలు వాయిదాపడతాయి. కళ, క్రీడా, సాంకేతిక రంగాలవారికి ప్రోత్సాహం లభిస్తుంది. స్వయంకృషితో రాణిస్తారనే విషయం గ్రహించండి.
 
తుల: నిరుద్యోగులకు ప్రముఖ సంస్థల్లో అవకాశాలు లభిస్తాయి. సోదరీ, సోదరుల మధ్య అవగాహన కుదరదు. తెలివి తేటలతో వ్యవహరించడం వల్ల కొన్ని వ్యవహారాలు మీకు అనుకూలిస్తాయి. వ్యాపారాలకు సంబంధించి ఒక సమాచారం నిరుత్సాహం కలిగిస్తుంది. గొప్ప గొప్ప ఆలోచనలు, ఆశయాలు స్ఫురిస్తాయి. 
 
వృశ్చికం: అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. మందులు, రసాయనాలు, ఆల్కహాలు, సుగంధద్రవ్య వ్యాపారులకు కలసిరాగలదు. ఉద్యోగస్తులకు సమస్యలు తలెత్తుతాయి. స్త్రీల పట్టుదల, మొండి వైఖరి వల్ల గృహంలో ప్రశాంతత లోపిస్తుంది. సందర్భం లేకుండా నవ్వడం వల్ల కలహాలు ఎదుర్కొనవలసివస్తుంది. 
 
ధనస్సు: కుటుంబ సౌఖ్యం కొంత తగ్గుతుందనే చెప్పవచ్చు. మీ స్థోమతకు మించి వాగ్ధానాల వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. రవాణా రంగంలో వారికి సంతృప్తి కానరాగలదు. స్త్రీలకు పనివారలతో ఒత్తిడి, చికాకులు తప్పవు. ఇతరుల గురించి హాస్యానికై మీరు చేసిన వ్యాఖ్యానాల వల్ల ఊహించని సమస్యలు తలెత్తుతాయి.
 
మకరం: ఉపాధ్యాయులకు, మార్కెటింగ్ రంగాల వారికి ఆశించిన అవకాశాలు లభిస్తాయి. ఇతరుల మేలు కోరి మీ వాక్కు ఫలిస్తుంది. స్త్రీలకు ఆరోగ్యపరంగాను, ఇతరత్రా సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది. సమావేశానికి ఏర్పాట్లు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్లకు ఓర్పు, నేర్పు చాలా అవసరం.
 
కుంభం: ఫర్నీచర్ అమరికలకు అవసరమైన నిధులు సమకూర్చుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి పెరుగుతుంది. అనుకోని విధంగా పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. పెద్దల ఆరోగ్యం నిర్లక్ష్యం చేయడం వల్ల ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు.
 
మీనం: ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు దైనందిన కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. నూనె, మిర్చి, కంది స్టాకిస్టు వ్యాపారస్తులకు అనుకూలంగా వుంటుంది. స్త్రీల కారణంగా చిక్కుల్లో పడే ఆస్కారం వుంది. జాగ్రత్త వహించండి. బాకీలు, ఇంటి అద్దెల వసూలులో సంయమనం పాటించండి.