శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By chj
Last Modified: మంగళవారం, 30 ఆగస్టు 2016 (14:27 IST)

దోష నివారణకు గణపతి పూజ... ఏయే దోషాలు పోతాయో తెలుసా...?

మనం చేసిన దోషాలు తొలగించుకోవడానికి గణేశారాధన మంచిదని చెబుతుంటారు. మనం చేసిన దోషాలు మన దగ్గరికి రాకుండా, మనం వాటిని తొలగించుకోవాలంటే గణేశారాధన చేయాల్సిందే. సూర్యదోష నివారణకు ఎర్రచందనంతో చేసిన గణపతిని పూజించాలి. చంద్ర దోష నివారణకు వెండి లేక పాలరాయితో చ

మనం చేసిన దోషాలు తొలగించుకోవడానికి గణేశారాధన మంచిదని చెబుతుంటారు. మనం చేసిన దోషాలు మన దగ్గరికి రాకుండా, మనం వాటిని తొలగించుకోవాలంటే గణేశారాధన చేయాల్సిందే. సూర్యదోష నివారణకు ఎర్రచందనంతో చేసిన గణపతిని పూజించాలి. చంద్ర దోష నివారణకు వెండి లేక పాలరాయితో చేసిన వినాయకుడిని పూజించాలి. కుజదోష నివారణకు రాగితో చేసిన వినాయకుడిని పూజిస్తే ఫలితం ఉంటుంది. 
 
బుధ దోష నివారణకు మరకత గణపతిని అర్చించాలి. గురు దోష నివారణకు పసుపు, చందనం లేక బంగారంతో చేసిన గణపతిని కొలవాలి. శుక్ర దోష నివారణకు స్ఫటిక గణపతికి ఆరాధన చేయాలి. శని దోష నివారణకు నల్లరాయిపై చెక్కిన గణపతిని పూజించాలి. రాహు గ్రహ దోషానికి మట్టితో చేసిన గణపతిని పుజిస్తే ఫలితం ఉంటుంది. 
 
కేతు గ్రహ దోష నివారణకు తెల్ల జిల్లేడుతో చేసిన గణపతిని పూజించాలి. ఎర్రచందనంతో చేసిన గణపతిని పూజించడం వల్ల అనారోగ్య సమస్యలు ఉండవు.పగడపు గణపతిని పూజించడం వల్ల అప్పుల బాధలు తొలగిపోతాయి. పాలరాయితో చేసిన గణపతిని పూజిస్తే మానసిక ప్రశాంతత కలుగుతుంది. మనకు ఎదురవుతున్న సమస్యలు తొలగిపోవాలంటే శ్వేతార్క గణపతిని పూజించాలి. స్ఫటిక గణపతిని పూజిస్తే సుఖశాంతులను ప్రసాదిస్తాడు.