ఆదివారం, 26 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By Selvi
Last Updated : శనివారం, 16 జులై 2016 (16:08 IST)

కంటి దృష్టికి సముద్ర జలానికి సంబంధం ఉందా? మంగళవారం అలా చేస్తే?

కంటి దృష్టికి సరైన మందు లేదని పెద్దలంటూ వుంటారు. ఒకరి దృష్టి పడిందంటే.. ఎదుటి వ్యక్తి అనారోగ్యంతో బాధపడాల్సిందే. నీరసం తప్పదంతే. రాయి దెబ్బకంటే కంటి దృష్టి ప్రమాదమంటారు. కంటి దృష్టి పడితే ఏ పని చేసినా

కంటి దృష్టికి సరైన మందు లేదని పెద్దలంటూ వుంటారు. ఒకరి దృష్టి పడిందంటే.. ఎదుటి వ్యక్తి అనారోగ్యంతో బాధపడాల్సిందే. నీరసం తప్పదంతే. రాయి దెబ్బకంటే కంటి దృష్టి ప్రమాదమంటారు. కంటి దృష్టి పడితే ఏ పని చేసినా నీరసం ఏర్పడుతుంది. శారీరక శ్రమ ఎక్కువైతే నీరసం ఏర్పడటం సహజం. అయితే ఉత్తుత్తికే శరీరాన్ని నీరసం ఆవహించినట్లుంటే వెంటనే కంటి దృష్టి పడిందని గ్రహించాలి. 
 
శరీరంలోని సప్త చక్రాలు క్రమంగా ఉంటేనే ఆరోగ్యంగా ఉండగలుగుతాం. కంటి దృష్టితో సప్త చక్రాలకు దెబ్బ తప్పదు. అధికంగా కంటి దృష్టి ఉంటే.. నీటితో స్నానం చేసేయాలి. అదీ సముద్రపు నీటిలో ఓ మునిగేస్తే కంటి దృష్టి పటాపంచలవుతుంది. శరీరానికి కొత్త ఉత్సాహం చేకూరుతుంది. 
 
కంటి దృష్టిని ఎలా గ్రహించాలి?
కంటి దృష్టి అధికంగా ఉండే ఇళ్ళల్లో.. ఒక విధమైన దుర్వాసన వస్తుంది. ఎన్ని సుగంధద్రవ్యాలు, సెంట్లు కొట్టినా దుర్వాసన వుంటూనే వుంటుంది. సాంబ్రాణి వేసినా ఆ దుర్వాసన పోవడం కష్టం. తద్వారా ఇంట్లో దుశక్తి ఉన్నట్లు గ్రహించాలి. ఇందుకు సముద్రపు నీటిని బాటిల్‌లో ఇంటికి పట్టుకొచ్చి.. ఇంటిని శుభ్రం చేసే నీటిలో కలిపి క్లీన్ చేసుకోవాలి. లేదా ఇంటిని శుభ్రం చేసే నీటిలో ఉప్పును కలుపుకుంటే సరిపోతుంది.  
 
వారానికి ఒకసారి ఉప్పు నీటితో స్నానం చేయడం ద్వారా కంటి దృష్టి లోపాలు తొలగిపోతాయి. నీరసం, సోమరితనం తొలగిపోతుంది. పుట్టిన వారాల్లో లేదా మంగళవారం పూట సముద్రపు నీటిలో స్నానం చేసేవారికి దృష్టిలోపాల ప్రభావం తగ్గుతుందని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. 
  
ఇక వ్యాపారం చేసే వారు తమ షాపులపై కంటి దృష్టి పడకుండా చేసుకోవాలి. లేకుంటే ఆర్థిక నష్టాలు తప్పవు. ఆర్థిక పరిస్థితి మెరుగవ్వాలంటే.. వ్యాపారంలో అభివృద్ధి చేకూరాలంటే... ఒక పెద్ద నిమ్మకాయను సగానికి కట్ చేసి, కుంకుమ ఒకవైపు, పసుపు మరోవైపు అద్ది గడపలో ఉంచాలి. ఇలా ప్రతి మంగళవారం చేయడం మంచిది. వారానికి ఓసారి ఈ పండును మార్చాలి. అలా మార్చేటప్పుడు పాతపండును చేతబట్టుకుని ఇంటి గడపను చేతిలో ఉన్న పండుతో మూడు సార్లు చుట్టి వీధిలో పారేయాలి. ఇలా ఇళ్లకూ చేయొచ్చు. 
 
ఇక కృష్ణపక్షంలో వచ్చే మంగళవారం, శనివారం, ఆదివారాల్లో సముద్ర తీరానికి వెళ్ళి.. సముద్ర జలాన్ని తీసుకొచ్చి.. అందులో పసుపు చేర్చి.. ఇళ్లు, దుకాణాలు, కార్యాలయాల్లో చల్లడం ద్వారా కంటి దృష్టిని పోగొట్టుకోవచ్చు. సముద్ర జలాన్ని ఇంట్లో చల్లడం ద్వారా శరీరంలోని సప్త చక్రాలు బలపడతాయి. అందుకే కంటి దృష్టి లోపాలు తొలగిపోతాయి.