పెద్ద బొజ్జతో భుజంపై డబ్బు మూటలతో వున్న కుబేరుడు ఇంట్లో వుంటే?
పాశ్చాత్య ధోరణులు మన దేశంలోకి ప్రవేశించిన తర్వాత పూజించే దేవుళ్లు ఆకారాలు కూడా మార్చేసే పరిస్థితి వచ్చింది. చాలామంది మన హైందవ సిద్ధాంతాలను వదిలేసి చైనా వాస్తు ఫెంగ్ షుయ్... తదితర సూత్రాలను పాటించడం చూస్తుంటాం. అంతేకాదు... చైనావారు తయారు చేసిన లాఫింగ్
పాశ్చాత్య ధోరణులు మన దేశంలోకి ప్రవేశించిన తర్వాత పూజించే దేవుళ్లు ఆకారాలు కూడా మార్చేసే పరిస్థితి వచ్చింది. చాలామంది మన హైందవ సిద్ధాంతాలను వదిలేసి చైనా వాస్తు ఫెంగ్ షుయ్... తదితర సూత్రాలను పాటించడం చూస్తుంటాం. అంతేకాదు... చైనావారు తయారు చేసిన లాఫింగ్ బుద్ధ, డబ్బు మూటను వీపుపై పెట్టుకుని నవ్వుతూ వుండే కుబేరుడి ప్రతిమ, ఇంకా పీఠంపై కూర్చుని తన ముందు డబ్బు రాశులను పేర్చి పెట్టుకుని కనిపించే కుబేరుని ప్రతిమలను ఇంట్లో పెట్టుకుంటూ వుంటారు.
వాస్తవానికి ఈ ప్రతిమలు ఇంట్లో పెద్దగా ఫలితాలను ఇవ్వవంటున్నారు. భారతీయ హైందవ సంప్రదాయం ప్రకారం చిత్రాలలో గీయబడిన కుబేరుడు, అంటే ముంగీసతో వుండే కుబేరుని చిత్ర పటాన్ని ఇంట్లో పెట్టుకుంటే ధనధాన్యాలు సమృద్ధిగా చేకూరుతాయని చెపుతున్నారు. అంతే తప్ప డబ్బు మూటలు వీపుపై వేసుకుని వుండే కుబేరుని ప్రతిమల వల్ల ఫలితం వుండదంటున్నారు.