ఆదివారం, 5 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By selvi
Last Updated : బుధవారం, 22 నవంబరు 2017 (14:26 IST)

జంట గాడిదలు, తెలుపు గుర్రాలను చూస్తే డబ్బు వస్తుందట..

అబ్రహాం లింకన్ పటాన్ని ఉదయం నిద్రలేవగానే చూస్తే డబ్బు వస్తుందట. గురువారం సాయంత్రం 4 గంటల నుంచి ఐదు గంటల వరకు కుబేర కాలమని.. ఈ సమయంలో ఇంట కుబేరునిని ధ్యానిస్తే.. ధనార్జన సులువవుతుంది. ఇక సంపదకు దేవత అయ

అబ్రహాం లింకన్ పటాన్ని ఉదయం నిద్రలేవగానే చూస్తే డబ్బు వస్తుందట. గురువారం సాయంత్రం 4 గంటల నుంచి ఐదు గంటల వరకు కుబేర కాలమని.. ఈ సమయంలో ఇంట కుబేరునిని ధ్యానిస్తే.. ధనార్జన సులువవుతుంది. ఇక సంపదకు దేవత అయిన శ్రీ మహాలక్ష్మీ దేవిని 24 శుక్రవారాలు నిష్ఠతో పూజిస్తే, ఆర్థిక ఇబ్బందులు, రుణ బాధలు తీరిపోతాయి. 
 
ఇక శ్రీరంగం అమ్మవారిని దర్శించుకున్నా ఆర్థిక ఇబ్బందులుండవు. కనకధార స్తోత్రం, శ్రీసూక్తం చదివితే డబ్బుకు లోటుండదు. ఇంకా నక్షత్రాలకు మేలు చేసే మూలికను బీరువాలో పెట్టుకుంటే ఆర్థిక సమస్యలుండవు. జంట గాడిదల పటాన్ని చూస్తే, తెలుపు రంగు గుర్రాలను అప్పుడప్పుడూ చూస్తే వుంటే ధనలాభం చేకూరుతుంది. అలాగే రోజూ వారి వారి కులదైవాన్ని స్మరించడం, ప్రార్థించడం ద్వారా ఈతిబాధలు, ఆర్థిక ఇబ్బందులను తొలగించుకోవచ్చు. గోమాతను దర్శించుకోవటం.. పూజించటం ద్వారా ధనం చేకూరుతుంది. 
 
రోజూ అభిజిత్ కాలంలో మధ్యాహ్నం 11 గంటల నుంచి 12 గంటల వరకు వారి వారి జన్మ నక్షత్రాలకు చెందిన అధిదేవతలను స్మరించుకోవడం ద్వారానూ ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి. అలాగే అమావాస్య రోజున పితృదేవతలను పూజించి, తర్పణాలు ఇవ్వడం చేయాలి. ఇలా చేస్తే కోరుకున్న కోరికలు తీరుతాయి. అష్టకష్టాలు తొలగిపోతాయి. పద్మావతీ సమేత తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామి పటాన్ని చూస్తే ఆర్థిక నష్టాలు, ఈతిబాధలు వుండవని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.