ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By raman
Last Updated : బుధవారం, 22 నవంబరు 2017 (08:51 IST)

బుధవారం రాశి ఫలితాలు.. ప్రేమికులకు స్నేహితులు అండగా నిలుస్తారు

మేషం: కిరాణా, ఫ్యాన్సీ, మందులు, ఆల్కహాలు, రసాయన, సుగంధ ద్రవ్య వ్యాపారులకు పురోభివృద్ధి. రాబడికి మించిన ఖర్చులెదురైనా ఆర్థిక వెసులుబాటు ఉంటుంది. రాజకీయ నాయకులకు ప్రయాణాలలో అపరిచిత వ్యక్తులపట్ల మెళకువ అ

మేషం: కిరాణా, ఫ్యాన్సీ, మందులు, ఆల్కహాలు, రసాయన, సుగంధ ద్రవ్య వ్యాపారులకు పురోభివృద్ధి. రాబడికి మించిన ఖర్చులెదురైనా ఆర్థిక వెసులుబాటు ఉంటుంది. రాజకీయ నాయకులకు ప్రయాణాలలో అపరిచిత వ్యక్తులపట్ల మెళకువ అవసరం. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు.
 
వృషభం: మనసులో భయాందోళనలూ అనుమానాలూ ఉన్నా, డాంబికం ప్రదర్శించి పనులు సాఫీగ పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులు సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. స్త్రీలకు పనిభారం అధికం. కొత్త సమస్యలు తలెత్తే ఆస్కారం వుంది. మెలకువ వహించండి. అవగాహన లేని వ్యాపారాలు, వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. 
 
మిథునం: ఉద్యోగస్తుల శ్రమకు గుర్తింపు, ఆర్థిక లబ్ధి వంటి శుభపరిణామాలుంటాయి. స్టాక్ మార్కెట్ రంగాల వారికి మిశ్రమ ఫలితం. గృహ మరమ్మతులు, నిర్మాణాలు చేపడతారు. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఎదుటివారి తీరును గమనించి తదనుగుణంగా వ్యవహరించడం మంచిదని గమనించండి. 
 
కర్కాటకం: ఆర్థిక లావాదేవీలు, కుటుంబ వ్యవహారాలు సమర్థంగా నిర్వహిస్తారు. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాల వారికి పురోభివృద్ధి. ఉపాధ్యాయులకు మార్పులు అనుకూలిస్తాయి. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్లు, అనుకూలిస్తాయి. ఖర్చులు పెరిగే ఆస్కారం ఉంది. ధనవ్యయంతో ఏకాగ్రత వహించండి.
 
సింహం: వాతావరణంలో మార్పు వల్ల స్త్రీల ఆరోగ్యం మందగిస్తుంది. నిర్మాణ పనుల్లో కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు ఏకాగ్రత అవసరం. ప్రింటింగ్ రంగాల వారికి శ్రమాధిక్యత తప్పదు. కోర్టు వ్యవహారాలు వాయిదా పడతాయి. విద్యార్థులు అనవసర విషయాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. ప్రముఖులను కలుసుకుంటారు. 
 
కన్య: పాత మిత్రుల కలయిక మీలో నూతనోత్సాహం కలిగిస్తుంది. కోర్టు వ్యవహారాలు వాయిదాపడటం మంచిదని గమనించండి. ప్రేమికులకు సన్నిహితులు అండగా నిలుస్తారు. నిర్మాణ పనులు, గృహమరమ్మతులు చురుకుగా సాగుతాయి. ఎప్పటి నుంచో వేధిస్తున్న ఒక సమస్య మీకు అనుకూలంగా పరిష్కారమవుతుంది. 
 
తుల: ఉపాధ్యాయులకు, మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. గృహ మరమ్మతులు, మార్పులు చేర్పులు అనుకూలిస్తాయి. కొత్తగా చేపట్టిన వ్యాపారాల్లో క్రమేణా నిలదొక్కుకుంటారు. ప్రేమికులకు పెద్దల నుంచి ఆమోదం లభిస్తుంది. పత్రిక, ప్రైవేట్ సంస్థల్లోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. 
 
వృశ్చికం: కళ, క్రీడా, సాంకేతిక రంగాల వారికి ప్రోత్సాహం లభిస్తుంది. ఉద్యోగస్తులకు అధికారుల వైఖరి నిరుత్సాహం కలిగిస్తుంది. బంధువుల కోసం మీ కార్యక్రమాలు వాయిదా వేసుకోవాల్సివస్తుంది. మీ హోదా చాటుకోవటానికి ధనం బాగా వ్యయం చేయవలసివస్తుంది. స్వర్ణకారులు, వ్యాపారులకు పనివారలతో చికాకులు తప్పవు.
 
ధనస్సు: ముక్కుసూటిగా పోయే మీ ధోరణి వివాదాస్పదమవుతుంది. ప్రింటింగ్, స్టేషనరీ రంగాల వారికి పని ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. కొబ్బరి, పండ్ల, పూల చిరు వ్యాపారులకు లాభదాయకం. విద్యార్థులకు నూతన పరిచయాలు, వాతావరణం కొత్త ఉత్సాహాన్నిస్తుంది. దుబారా ఖర్చులు అధికమవుతాయి.
 
మకరం: స్త్రీలకు అధిక శ్రమ, ఒత్తిడి వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. చిన్నతరహా పరిశ్రమల వారికి సత్కాలం అని చెప్పవచ్చు. నిరుద్యోగుల ఆలోచనలు పలువిధాలుగా ఉంటాయి. లౌక్యంగా వ్యవహరించండి వల్ల కొన్ని వ్యవహారాలు మీకు అనుకూలిస్తాయి. ఖర్చులు పెరగడంతో రుణ యత్నాలు, చేబదుళ్ళు తప్పవు. 
 
కుంభం: హామీలు, చెక్కుల జారీల్లో ఏకాగ్రత వహించండి. స్త్రీలతో పనివారలతో ఒత్తిడులను, చికాకులను ఎదుర్కొంటారు. శత్రువులపై జయం పొందుతారు. ప్రియతములిచ్చే సలహా మీకెంతో సంతృప్తి నిస్తుంది. మీ ఆంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచడం క్షేమదాయకం. ఖర్చులు పెరిగినా ఇబ్బందులు ఏమాత్రం ఉండవు. 
 
మీనం: మీ ఉన్నతిని చూసి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. స్త్రీల సరదాలు, మనో వాంఛలు నెరవేరుతాయి. కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు కలసివస్తుంది. ఉమ్మడి వ్యవహారాల్లో పట్టింపులు ఎదురవుతాయి. నూతన విషయాలను తెలుసుకుంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు.