శనివారం, 25 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By raman
Last Updated : శుక్రవారం, 17 నవంబరు 2017 (08:27 IST)

శుక్రవారం దినఫలాలు.. లక్ష్మీదేవిని ఆరాధించినా...

మేషం: ఆర్థిక విషయాల్లో ఒకడుగు ముందుకు వేస్తారు. వృత్తుల వారికి అన్ని విధాలా కలిసిరాగలదు. స్త్రీల అభిప్రాయాలకు ఇంటా బయటా మంచి స్పందన లభిస్తుంది. వ్యాపారాల్లో క్రమేణా ఆటుపోట్లు తొలగి కొంత పురోగతి సాధిస్

మేషం: ఆర్థిక విషయాల్లో ఒకడుగు ముందుకు వేస్తారు. వృత్తుల వారికి అన్ని విధాలా కలిసిరాగలదు. స్త్రీల అభిప్రాయాలకు ఇంటా బయటా మంచి స్పందన లభిస్తుంది. వ్యాపారాల్లో క్రమేణా ఆటుపోట్లు తొలగి కొంత పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో విజయం సాధించడానికి ఎలాంటి అవకాశం వచ్చినా జారవిడుచుకోకండి.
 
వృషభం: స్త్రీలు తొందరపడి సంభాషిచడం వల్ల మాటపడక తప్పదు. కొన్ని రహస్యాలు దాచిపెట్టాలనుకున్నా సాధ్యం కాదు. కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు కలిసివస్తుంది. మీ తప్పులు సరిదిద్దుకునేందుకు శ్రమిస్తారు. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. సాహస ప్రయత్నాలు విరమించండి. 
 
మిథునం : మీ విషయాల్లో ఇతరుల ప్రమేయం లేకుండా జాగ్రత్త పడండి. దైవ, వన సమారాధనలలో ప్రముఖంగా వ్యవహరిస్తారు. కోర్టు వ్యవహరాల్లో ప్లీడర్ల తీరు ఆందోళన కలిగిస్తుంది. స్త్రీలకు ఆరోగ్యపరమైన సమస్యలు, ఇతరత్రా చికాకులు అధికమవుతాయి. కొబ్బరి, పండ్ల, పూల, చిరు వ్యాపారులకు పురోభివృద్ధి. 
 
కర్కాటకం: ఆలయాలను సందర్శిస్తారు. వాతావరణంలో మార్పు మీకెంతో చికాకు కలిగించగలదు. ప్లీడర్లు, ప్లీడరు గుమాస్తలకు పురోభివృద్ధి. ప్రభుత్వపరంగా రుణమాఫీలు, సబ్సీడీలు అధికంగా ఉంటాయి. పోస్టల్, టెలిగ్రాఫ్ రంగాల్లోని వారు ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. సంఘంలో మీ కీర్తి, ప్రతిష్టలు ఇనుమడిస్తాయి.
 
సింహం: ఆర్థిక విషయాల్లో గోప్యంగా వ్యవహరిస్తారు. శస్త్ర చికిత్స చేయునప్పుడు వైద్యులకు ఏకాగ్రత, మెళకువ అవసరం. పెంపుడు జంతువుల గురించి ఆందోళన చెందుతారు. కళ, క్రీడా రంగాల వారికి ప్రోత్సాహం లభిస్తుంది. అందరితోను కలుపుగోలుగా వ్యవహరించి మీ పనులు సానుకూలం చేసుకుంటారు.
 
కన్య: బ్యాంకు వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. ఆలయ సందర్శనాల్లో ఇబ్బందులు తప్పవు. రావలసిన ధనంలో కొంత మొత్తం చేతికందుతుంది. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. మీ దురదృష్టానికి మిమ్ములను మీరే నిందించుకుంటారు. విదేశాలకు వెళ్ళాలనే కోరిక అధికమవుతుంది.
 
తుల: మీ గౌరవ మర్యాదలకు భంగం కలుగకుండా జాగ్రత్త వహించండి. స్త్రీలకు పనివారలతో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. రచయితలకు పత్రికా రంగంలో వారికి కలిసి రాగలదు. కోర్టు వ్యవహారాల్లో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆపద సమయంలో బంధువులు అండగా నిలుస్తారు.
 
వృశ్చికం: ఉమ్మడి వ్యవహారాల్లో చికాకులు. భాగస్వాములతో అభిప్రాయ భేదాలు తలెత్తుతాయి. స్త్రీలకు స్కీమ్‌లు ప్రకటనల వల్ల మోసపోయే ఆస్కారం వుంది. జాగ్రత్త వహించండి. విందులతో పరిమితి పాటించండి. ఆదాయ వ్యయాల్లో ప్రణాళికబద్ధంగా వ్యవహరిస్తారు. కాంట్రాక్టర్లకు నూతన టెండర్లు అతి కష్టంమ్మీద అనుకూలిస్తాయి. 
 
ధనస్సు: బ్యాంకు వ్యవహారాలు వాయిదా  పడతాయి. సిమెంట్, కలప, ఐరన్, ఇటుక వ్యాపారులకు మిశ్రమ ఫలితం. ప్రముఖులతో పరిచయాలు, వ్యాపకాలు పెరుగుతాయి. గతంల చేసిన తప్పిదం పశ్చాత్తాపం కలిగిస్తుంది. స్త్రీలకు ఆర్జన పట్ల ఆసక్తి పెరుగుతుంది. నోరు అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. 
 
మకరం: ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. బ్యాంకు పనుల్లో స్వల్ప ఆటంకాలను ఎదుర్కొంటారు. ప్రైవేట్ రంగాల్లో వారు తమ విరోధులు తమ చుట్టూ ఉన్నారని గమనించండి. సోదరీ, సోదరులతో కలయిక, పరస్పర అవగాహన కుదురును. బంధువుల రాకతో ఇల్లు కళకళలాడుతుంది.
 
కుంభం: ఆహార, వ్యవహారాలు, ఆరోగ్యంలో తగు జాగ్రత్తలు అవసరం. ప్రముఖులను కలుసుకుంటారు. బ్యాంకు పనుల్లో స్వల్ప ఆటంకాలను ఎదుర్కొంటారు. బంధువులకు పెద్ద మొత్తాలలో ధనసహాయం చేసే విషయంలో లౌకికం ఎంతో అవసరం. ఇతరుల సాయం కోసం ఎదురుచూడకుండా మీ యత్నాలు సాగించండి. 
 
మీనం: ఉపాధ్యాయులకు విద్యార్థుల వల్ల ఒత్తిడి చికాకులను ఎదుర్కొంటారు. వాహనం నడుపుతున్నప్పుడు మెళకువ అవసరం. మీ కోసం, మీ కుటుంబీకుల కోసం ధనం బాగుగా వెచ్చిస్తారు. వీలైనంత వరకూ మీ పనులు మీరే చేసుకోవటం ఉత్తమం. ఐటీ రంగాల్లో వారికి మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంది.