శనివారం, 4 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By raman
Last Updated : బుధవారం, 15 నవంబరు 2017 (08:17 IST)

శుభోదయం.. నేటి దినఫలితాలు.. స్త్రీల ఓర్పుకు పరీక్షా సమయం

మేషం: ఆదాయ వ్యయాలు సరిసమానంగా ఉంటాయి. పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు. రావలసిన ధనం చేతికి అందడంతో పొదుపు పథకాల దిశగా మీ ఆలోచనలుంటాయి. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. గత

మేషం: ఆదాయ వ్యయాలు సరిసమానంగా ఉంటాయి. పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు. రావలసిన ధనం చేతికి అందడంతో పొదుపు పథకాల దిశగా మీ ఆలోచనలుంటాయి. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. గతంలో చేసిన తప్పిదం పశ్చాత్తాపం కలిగిస్తుంది. 
 
వృషభం: ఉపాధ్యాయులకు, మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. పత్రిక వార్తా సంస్థల్లోని వారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది. స్త్రీలు చుట్టుపక్కల వారితో, పనివారలతో లౌక్యంగా వ్యవహరించాల్సి వుంటుంది. మీ వాహనం ఇతరులకిచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. 
 
మిథునం: మీ శ్రీమతి ప్రోత్సాహంతో కొత్త యత్నాలు మొదలెడతారు. కష్ట సమయంలో మిత్రులకు అండగా నిలుస్తారు. బ్యాంకు పనులు ఆశించినంత చురుకుగా సాగవు. ఉద్యోగస్తుల శ్రమకు, అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. అలౌకిక విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీ గౌరవ ప్రతిష్టలు  పెంపొందుతాయి.
 
కర్కాటకం: ఆర్థికంగా పురోగమించడానికి చేసే యత్నాలు ఫలిస్తాయి. విద్యార్థుల మొండి వైఖరి ఉపాధ్యాయులకు చికాకు కలిగిస్తుంది. స్త్రీల మనోవాంఛలు నెరవేరుతాయి. సంతోషకరమైన వార్తలు వింటారు. ప్రైవేట్ సంస్థల్లోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. కుటుంబీకుల మధ్య కీలకమైన విషయాలు చర్చకు వస్తాయి.
 
సింహం : గృహానికి సంబంధించిన విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. వాతావరణంలో మార్పు వల్ల స్త్రీల ఆరోగ్యం మందగిస్తుంది. కోర్టు వ్యవహారాలు, భూ వివాదాలు కొత్త మలుపు తిరుగుతాయి. సమయానికి ధనం అందకపోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. నోటీసులు, ప్రముఖుల నుంచి లేఖలు అందుకుంటారు. 
 
కన్య: భాగస్వామిక వ్యాపారాల నుంచి విడిపోవాలనే ఆలోచన బలపడుతుంది. స్త్రీలు అనవసరపు విషయాలకు ప్రాధాన్యం ఇచ్చి ఇబ్బందులకు గురవుతారు. ఖర్చులు ఊహించినవి కావడంతో ఇబ్బందులు పెద్దగా వుండవు. ప్రయాణాల్లో కొత్త కొత్త వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి. మీ అభిప్రాయాలకు మంచి స్పందన లభిస్తుంది.
 
తుల : దైవ దర్శనాల్లో చికాకులు ఎదుర్కొంటారు. రాజకీయ వర్గాల వారికి విదేశీ పర్యటనలు తప్పవు. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. బంధువులతో తెగిపోయిన సంబంధాలు బలపడతాయి. నిరుద్యోగులకు అవకాశాలు అందినట్టే చేజారిపోతుంటాయి. వృత్తి వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులు పెద్దగా వుండవు. 
 
వృశ్చికం: ఉద్యోగ బాధ్యతల్లో పొరపాట్లను సరిదిద్దుకుంటారు. ప్లీడర్లకు, వైద్యరంగంలోని వారికి ఒత్తిడి పెరుగుతుంది. దంపతుల మధ్య ఏకాభిప్రాయం లోపిస్తుంది. విదేశీయానం కోసం చేసే యత్నాలు అనుకూలిస్తాయి. దైవ, పుణ్య, సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. వీలైనంత వరకూ మీ పనులు మీరే చూసుకోవడం ఉత్తమం.
 
ధనస్సు: స్త్రీలకు కళ్ళు, తల, నరాలకు సంబంధించిన చికాకులు తప్పవు. ఉద్యోగస్తులకు బరువు బాధ్యతలు పెరగడం వల్ల పనిభారం వంటి సమస్యలను ఎదుర్కొంటారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూల్లో మెలకువ అవసరం. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్లలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు.
 
మకరం : వ్యాపారాభివృద్ధికి చేపట్టిన ప్రణాళికలు సత్ఫలితాలను ఇవ్వగలవు. ధన వ్యయం, రుణ సహాయానికి సంబంధించిన విషయాల్లో కుటుంబీకులను సంప్రదించడం మంచిది. ప్రయాణాల్లో నూతన పరిచయాలు ఏర్పడతాయి. శ్రమాధిక్యత మినహా ఆశించిన ఫలితాలు పొందలేరు. విలాస వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. 
 
కుంభం: ఆర్థికంగా ఎదగాలనే మీ ఆశయం నిదానంగా ఫలిస్తుంది. దానధర్మాలు చేయడం మంచి పేరు, ఖ్యాతి లభిస్తుంది. కోర్టు వ్యవహారాలు మీరు కోరుకున్నట్టుగానే వాయిదా పడతాయి. స్త్రీలు దైవ, శుభకార్యాల్లో ప్రముఖంగా వ్యవహరిస్తారు. హోటల్, తినుబండారాలు, క్యాటరింగ్ పనివారలకు కలసిరాగలదు. 
 
మీనం: ధనం విపరీతంగా వ్యయం అయినా ప్రయోజనకరంగా ఉంటాయి. మీ మాటకు కుటుంబంలోను, సంఘంలోను వ్యతిరేకత ఎదురవుతుంది. కాంట్రాక్టర్లకు నూతన టెండర్లు అనుకూలిస్తాయి. చిన్నతరహా పరిశ్రమల వారికి సత్కాలం అని చెప్పవచ్చు. స్త్రీల ఓర్పు, ఏకాగ్రతలకు ఇది పరీక్షా సమయం.