శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By raman
Last Updated : శుక్రవారం, 10 నవంబరు 2017 (10:17 IST)

శుభోదయం : 10-11-2017 మీ రాశి ఫలితాలు, రావలసిన ఆదాయం...

మేషం : ఆర్థిక విషయాలలో కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొంటారు. వస్త్ర, బంగారం, వెండి వ్యాపారులకు పనివారలతో చికాకులు తలెత్తుతాయి. స్థిర, చరాస్తుల విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. ప్రియతములరాక సంతోషం కలిగిస్తుం

మేషం : ఆర్థిక విషయాలలో కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొంటారు. వస్త్ర, బంగారం, వెండి వ్యాపారులకు పనివారలతో చికాకులు తలెత్తుతాయి. స్థిర, చరాస్తుల విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. ప్రియతములరాక సంతోషం కలిగిస్తుంది. ఆకస్మిక ప్రయాణాలు వాయిదాపడుట మంచిది. క్రయ విక్రయాలు లాభదాయకం. 
 
వృషభం : ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తినా బంధువుల సహకారం వల్ల సమసిపోగలవు. వ్యవహారాలు, ఒప్పందాల్లో మీ అభిప్రాయాలను ఖచ్చితంగా వెల్లడించాలి. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. ఉద్యోగ, వ్యాపారులకు అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. మిత్రులను కలుసుకుంటారు. 
 
మిథునం : రేషన్, గ్యాస్, పెట్రో డీలర్లకు వ్యాపారులకు కొత్త సమస్యలు తలెత్తే సూచనలున్నాయి. రావలసిన ఆదాయాన్ని లౌక్యంగా వసూలు చేసుకోవాలి. కొత్త ప్రాజెక్టులకు అనుకూలం. ఉద్యోగస్తులు అధికారులకు వివరణ ఇచ్చుకోవలసి వస్తుంది. పరిచయస్తుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. కోర్టు వాయిదాలు నిరుత్సాహపరుస్తాయి. 
 
కర్కాటకం : చెక్కులు చెల్లక వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు ఇబ్బందులెదుర్కొంటారు. ఎదుటివారి విషయాలకు దూరంగా ఉండటం మంచిది. పండ్లు, పూల, కూరగాయల, నిత్యావసర వస్తు వ్యాపారులకు, స్టాకిస్టులకు కలిసిరాగలదు. విద్యార్థులు క్రీడల పట్ల ఆసక్తి కనబరుస్తారు. స్త్రీల మాట తీరు ఇబ్బందులకు దారితీస్తాయి. 
 
సింహం : వివాదాస్పద విషయాల్లో వాస్తవాలు బయటపడతాయి. మీకొచ్చిన కష్టానికి సానుభూతిచూపే వారే కానీ, సహాయం చేసేవారుండరు. మీ సంతానం నుంచి సంతోషకరమైన వార్తలు వింటారు. నిరుద్యోగులు వచ్చిన అవకాశాన్ని చేజిక్కించుకోవడం ఉత్తమం. సహోద్యోగులతో సమావేశాలు, శుభకార్యాల్లో పాల్గొంటారు. 
 
కన్య : స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి, చుట్టుపక్కల వారి ప్రోత్సాహం లభిస్తుంది. ఇతరులపై ఆధారపడటం మంచిదికాదని గమనించండి. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశం లభిస్తుంది. ఒక స్థిరాస్తి అమర్చుకోవాలనే ఆలోచన బలపడుతుంది. ఉద్యోగస్తులు పదోన్నతి కోసం చేసే యత్నాలు కొంతవరకు సఫలమవుతాయి. 
 
తుల : ఏజెంట్లు, బ్రోకర్లకు శ్రమాధిక్యత మినహా ప్రతిఫలం అంతగా ఉండదు. పారిశ్రామిక రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది. ఉపాధ్యాయులకు, రిప్రజెంటేటివ్‌లు ఏజెంట్లకు ఒక వార్త ఎంతో ఆందోళన కలిగిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. ఏదైనా స్థిరాస్తి అమ్మకం వాయిదాపడటం మంచిది. 
 
వృశ్చికం : ఆర్థిక వ్యవహారాలలో ఆటుపోట్లు తొలగుతాయి. పెద్దల ఆరోగ్య రీత్యా అధికంగా ధనవ్యయం చేస్తారు. స్థిరాస్తిని అమ్మటానికి చేయు ప్రయత్నంలో పునరాలోచన మంచిది. దైవకార్యాలపట్ల ఆసక్తి కనపరుస్తారు. బంధువులు ఒక వ్యవహారంలో మమ్మలను ఒత్తిడికి గురిచేస్తారు. వాహనం నిదానంగా నడపడం క్షేమదాయకం. 
 
ధనస్సు : దంపతుల మధ్య కొత్త విషయాలు చర్చకు వస్తాయి. మీ అంతరంగిక, కుటుంబ విషయాలు గోప్యంగా ఉంచండి. డాక్టర్లు ఆపరేషన్లను విజయవంతంగా పూర్తి చేస్తారు. దూర ప్రయాణాలు ఉల్లాసంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు మంచి గుర్తింపు లభిస్తుంది. బంధువులతో సంత్సంబంధాలు బలపడతాయి. 
 
మకరం : సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తుల సహాయం అందుతుంది. ఎంతోకొంత పొదుపు చేయాలన్న మీ యత్నం ఫలించదు. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలను ఎదుర్కొంటారు. నిరుద్యోగులకు అపరిచిత వ్యక్తుల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించవలసి ఉంటుంది. 
 
కుంభం : వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉడటం శ్రేయస్కరం. తొందరపాటు నిర్ణయాలు ఇబ్బందులకు దారితీస్తాయి. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు, రిజిస్ట్రేషన్లు అనుకూలిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు మీ ఉన్నతికి దోహదపడతాయి. స్త్రీలకు ఆధ్యాత్మిక చింతనతోపాటు ఇతర వ్యాపకాలు అధికమవుతాయి. 
 
మీనం : వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. మీ చిత్తశుద్ధి, నిజాయితీలకు ప్రశంసలు దక్కుతాయి. ఇతరుల స్థితిగతులతో పోల్చుకుని నిరుత్సాహం చెందుతారు. ప్రింటింగ్ రంగాల వారికి పురోభివృద్ధి. నూతన వ్యాపారాలు, ఉమ్మడి వెంచర్లు ప్రస్తుతానికి తగవు. ఏది జరిగినా మంచికేనని భావించండి.