శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By raman
Last Updated : సోమవారం, 6 నవంబరు 2017 (08:32 IST)

శుభోదయం : 06-11-17నాటి దినఫలాలు

మేషం : భాగస్వామ్యుల మధ్య పరస్పర అవగాహన లోపం, చికాకులు వంటివి తలెత్తవచ్చు జాగ్రత్త వహించండి. ధనం ఏమాత్రం నిల్వచేయలేకపోవడం వల్ల అశాంతి చోటుచేసుకుంటుంది. మత్స్య, కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది.

మేషం : భాగస్వామ్యుల మధ్య పరస్పర అవగాహన లోపం, చికాకులు వంటివి తలెత్తవచ్చు జాగ్రత్త వహించండి. ధనం ఏమాత్రం నిల్వచేయలేకపోవడం వల్ల అశాంతి చోటుచేసుకుంటుంది. మత్స్య, కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. కుటుంబీకులతో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు.
 
వృషభం : శుభకార్యాలు, సంప్రదింపుల్లో ప్రముఖంగా వ్యవహరిస్తారు. అందరినీ అతిగా నమ్మే మీ స్వభావం ఇబ్బందులకు దారితీస్తుంది. స్త్రీలు విలువైన వస్తువులు, గృహోపకరణాలు అమర్చుకుంటారు. అవగాహన లేని విషయాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. పెద్దల ఆరోగ్యములో మెళుకువ, ఏకాగ్రత అవసరం.
 
మిథునం : ఆర్థిక విషయాల్లో బంధువులతో మొహమాట పెట్టే ఆస్కారం ఉంది. ఒక స్థిరాస్తి అమర్చుకోవాలనే ఆలోచన స్ఫురిస్తుంది. దంపతుల మధ్య అనురాగవాత్సల్యాలు పెంపొందుతాయి. హోటల్, తినుబండ, క్యాటరింగ్ రంగాలలో వారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతాయి. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో మెళుకువ అవసరం.
 
కర్కాటకం : ఉపాధ్యాయులు విశ్రాంతి పొందుతారు. రుణ, విదేశీ యత్నాల్లో ఊహించని ఆటంకాలు ఎదుర్కొంటారు. వృత్తిపరంగా కొత్త పరిచయాలేర్పడతాయి. మీ వాహనం ఇతరులకిచ్చి ఇబ్బందులకు గురవుతారు. స్త్రీలకు ఎదుటివారి విషయాలపట్ల ఆసక్తి పెరుగుతుంది. కొన్ని అనుకోని సంఘటనలు దిగ్ర్భాంతికి గురిచేస్తాయి.
 
సింహం:  సోదరీ, సోదరుల మధ్య కలహాలు తొలగిపోయి ఒక అవగాహనకు వస్తారు. సాహసప్రయత్నాలు విరమించండి. వృత్తి, వ్యాపారులకు సమస్యలెదురైనా ఆదాయానికి కొదవ ఉండదు. విద్యార్థులు ఇతరుల వాహనం నడిపి ఇబ్బందులకు గురికాకండి. స్త్రీలు ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. ఖర్చులు అధికమవుతాయి.
 
కన్య : సహోద్యోగులతో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు. మీ నుంచి విషయాలు రాబట్టేందుకు ఎదుటివారు యత్నిస్తారు. దూరప్రయాణాలలో నూతన పరిచయాలేర్పడతాయి. మీ సంతానం విద్య, వివాహ విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. అనుకోకుండా నిరుద్యోగుల ఉద్యోగ యత్నాలు ఒక కొలిక్కి రాగలవు.
 
తుల : విద్యార్థులకు క్రీడలపట్ల ఆసక్తి పెరుగుతుంది. మీ పనులు, బాధ్యతలు ఇతరులకు అప్పగించటం మంచిది కాదు. ప్రియతములతో ప్రయాణాల్లో ఊహించని చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది. పత్రిక, మీడియా సంస్థల వారు అకారణంగా మాటపడవలసి వస్తుంది. స్త్రీలకు సంపాదనలపట్ల ఆసక్తి పెరుగుతుంది.
 
వృశ్చికం : ఆస్తి పంపకాల విషయంలో సోదరీ సోదరుల మధ్య సఖ్యత నెలకొంటుంది. ఉపాధ్యాయులు విశ్రాంతి పొందుతారు. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి అధికమవుతుంది. మనసులో భయాందోళనలూ అనుమానాలూ ఉన్నా, డాంబికం ప్రదర్శించి పనులు సాఫీగా పూర్తి చేస్తారు. దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది.
 
ధనస్సు : మీ అవసరాలకు కావలసిన ధనం సర్దుబాటు కాగలదు. వ్యాపారాల్లో నష్టాలను అధికమించటానికి కొత్త కొత్త పథకాలు రూపొందిస్తారు. స్త్రీలకు షాపింగ్ విషయాలలో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకుని భంగపాటుకు గురవుతారు. దూర ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది.
 
మకరం : మీ జీవిత భాగస్వామి సలహాతో ఒక సమస్య నుంచి బైటపడతారు. ఉపాధ్యాయులు విశ్రాంతికై చేయు యత్నాలు ఫలిస్తాయి. స్నేహితులతో కలిసి పిక్నిక్‌లు, పార్టీలలో పాల్గొంటారు. ప్రింటింగ్ రంగాల వారికి పనివారలతో సమస్యలు తప్పవు. వ్యాపారాల్లో ఆకర్షణీయమైన పథకాలతో వినియోగదారులను ఆకట్టుకుంటారు.
 
కుంభం : స్త్రీల కోరికలు, అవసరాలు నెరవేరుతాయి. ప్రేమికుల ఆలోచనలు పలువిధాలుగా ఉంటాయి. మీ అలవాట్లు, బలహీనతలు ఇబ్బందులకు దారితీస్తాయి. నూతన పరిచయాలుత పెంచుకుంటారు. ఏజెంట్లు, బ్రోకర్లు, క్యాటరింగ్ పనివారలకు సామాన్యంగా ఉంటుంది. కష్ట సమయంలో ఆత్మీయులు సహకరిస్తారు.
 
మీనం : మీ సంతానం కోసం ధనం అధికంగా వ్యయం చేస్తారు. గృహంలో ఏదైనా వస్తువు పోయేందుకు ఆస్కారం ఉంది, మెలకువ వహించండి. ద్విచక్ర వాహనంపై ప్రయాణలు మంచిది కాదని గమనించండి. రాజకీయనాయకలు సభ, సమావేశాలలో పాల్గొంటారు. ఆలయాలను సందర్శిస్తారు. పెద్దల ఆరోగ్యంలో సంతృప్తి.