ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By raman
Last Updated : శుక్రవారం, 3 నవంబరు 2017 (08:55 IST)

శుభోదయం : రాశిఫలాలు 03-11-17

మేషం : గణిత, సైన్స్, ఎలక్ట్రికల్ వృత్తుల్లో వారికి కలిసివచ్చే కాలం. కొన్ని సమస్యల నుంచి తేలికగా బయటపడతారు. ప్రేమ వ్యవహారాలలో విజయం సాధించడానికి ఎలాంటి అవకాశం వచ్చినా జారవిడుచుకోకండి. ఖర్చులు ప్రయోజనకర

మేషం : గణిత, సైన్స్, ఎలక్ట్రికల్ వృత్తుల్లో వారికి కలిసివచ్చే కాలం. కొన్ని సమస్యల నుంచి తేలికగా బయటపడతారు. ప్రేమ వ్యవహారాలలో విజయం సాధించడానికి ఎలాంటి అవకాశం వచ్చినా జారవిడుచుకోకండి. ఖర్చులు ప్రయోజనకరంగా ఉంటాయి. ముఖ్యుల కారణంగా మీ కార్యక్రమాలు వాయిదాపడతాయి. 
 
వృషభం : స్త్రీలకు వస్తు, ధనప్రాప్తి వంటి శుభపరిణామాలుంటాయి. మీ సంతానం ఆరోగ్యం, వివాహ విషయాల పట్ల దృష్టిసారిస్తారు. దైవ, సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. కళ, క్రీడాకారులకు ప్రోత్సాహం లభిస్తుంది. విద్యార్థులకు ధ్యేయం పట్ల ఏకాగ్రత కుదురుతుంది. బంధువర్గాల మద్దతు, సహాయ సహకారాలు లభిస్తాయి. 
 
మిథునం : ట్రాన్స్‌పోర్ట్, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల్లో వారికి కలిసివచ్చే కాలం. అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. విద్యార్థులు, అవివాహితులకు శుభవార్తా శ్రవణం. ఒక వ్యవహారం నిమిత్తం ఆకస్మిక ప్రయాణం తప్పదు. ఆస్తి వ్యవహారాలకు సంబంధించి సోదరులతో విభేదాలు తలెత్తుతాయి. 
 
కర్కాటకం : మీ శ్రమ, యత్నాలు వృధాకావు. సన్నిహితుల నుంచి ఆసక్తికరమైన విషయాలు గ్రహిస్తారు. మీ సంతానం మొండివైఖరి వల్ల చికాకులు ఎదుర్కొంటారు. పెద్దల ఆరోగ్యం కలవరపరుస్తుంది. పొదుపు పథకాల పట్ల ఆకర్షితులవుతారు. ఉన్నతస్థాయి అధికారులకు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తత అవసరం. 
 
సింహం : ఆర్థికంగా బాగుగా స్థిరపడతారు. వాహనం నడుపుతున్నపుడు మెలకువ వహించండి. నిరుద్యోగులకు చేపట్టిన ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. వృత్తి వ్యాపారులకు సంతృప్తి, పురోభివృద్ధి. రైతులకు, వ్యవసాయ కూలీలకు మందకొడిగా ఉంటుంది. గృహ మరమ్మతులు, నిర్మాణాలు అనుకూలిస్తాయి. 
 
కన్య : కాంట్రాక్టర్లకు నూతన టెండర్ల విషయంలో లౌక్యం అవసరం. సిమెంట్, కలప, ఐరన్, ఇటుక వ్యాపారులకు ఆశించినంత పురోభివృద్ధి ఉండదు. ఉద్యోగస్తులకు విధి నిర్వహణలో ఏకాగ్రత ముఖ్యం. మీ వాగ్ధాటితో ఎదుటివారిని మెప్పిస్తారు. చేతివృత్తులు, క్యాటరింగ్ పనివారలకు సదావకాశాలు లభిస్తాయి. 
 
తుల : కొత్త వ్యక్తులతో పరిచయాలు మీ ఉన్నతికి తోడ్పడతాయి. ఇతరుల ఆంతరంగిక విషయాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. మొక్కుబడులు వాయిదాపడతాయి. మీ శ్రీమతితో విందులు, వేడుకల్లో పాల్గొంటారు. ఖర్చులు, చెల్లింపులు ప్రయోజనకరంగా ఉంటాయి. వ్యాపారాభివృద్ధికి కొత్తకొత్త పథకాలు అమలు చేస్తారు. 
 
వృశ్చికం : వాహనం, విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు. ఉపాధ్యాయులకు యాజమాన్యం ఒత్తిడి అధికం. విద్యార్థుల ఆలోచనలు పక్కదారి పట్టే ఆస్కారం ఉంది. అపరేషన్ల సమయంలో వైద్యులకు ఏకాగ్రత ముఖ్యం. ఎల్ఐసి పోస్టల్ ఏజెంట్లకు సామాన్యం. కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు కలిసివస్తుంది. 
 
ధనస్సు : కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. మీ సంతానం విద్య, ఆరోగ్య విషయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తారు. అనుకోకుండా మీ పాత సమస్య పరిష్కారమవుతుంది. మీ వాహనం ఇతరులకిచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. మార్కెటింగ్, ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది. 
 
మకరం : బీమా, రుణ వాయిదాలు సకాలంలో చెల్లిస్తారు. కుటుంబ సమస్యలు తొలగిపోయి మానసిక ప్రశాంతత నెలకొంటుంది. ఉద్యోగస్తులకు రావలసిన క్లయింలు, ఇతర అలవెన్సులలో జాప్యం తప్పదు. రేషన్ డీలర్లు, నిత్యావసర వస్తు స్టాకిస్టులకు చికాకులు అధికమవుతాయి. స్త్రీల అభిప్రాయాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. 
 
కుంభం : అవివాహితులు కొత్త అనుభూతికి లోనవుతారు. మీ సంతానం కోసం కొత్తకొత్త పథకాలు రూపొందిస్తారు. భాగస్వామిక చర్చలు ప్రశాంతంగా ముగుస్తాయి. మీ ఆంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచండి. 
 
మీనం : మీ గౌరవ ప్రతిష్టలకు భంగం కలుగకుండా విజ్ఞతతో మెలగండి. రుణ యత్నాల్లో అనుకూలతలుంటాయి. చేపట్టిన పనులు కొంత ముందు వెనుకలుగానైనా ఆశించిన విధంగా పూర్తిచేస్తారు. మీ కుటుంబ విషయాల్లో ఇతరుల ప్రమేయం లేకుండా జాగ్రత్త వహించండి. ఆకస్మిక ఖర్చులు, ప్రయాణాలు ఆందోళన కలగిస్తాయి.