శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By raman
Last Updated : గురువారం, 2 నవంబరు 2017 (08:41 IST)

శుభోదయం : 02-11-17 దినఫలాలు

మేషం : రిప్రజెంటేటివ్‌లు, రియల్ ఎస్టేట్ రంగాల వారికి చికాకులు తప్పవు. వాహనం నడుపుతున్నప్పడు ఏకాగ్రత అవసరం. వృత్తుల వారికి అన్ని విధాలా కలిసిరాగలదు. నిరుద్యోగులు భేషజాలకు పోకుండా వచ్చిన అవకాశాలను సద్వి

మేషం : రిప్రజెంటేటివ్‌లు, రియల్ ఎస్టేట్ రంగాల వారికి చికాకులు తప్పవు. వాహనం నడుపుతున్నప్పడు ఏకాగ్రత అవసరం. వృత్తుల వారికి అన్ని విధాలా కలిసిరాగలదు. నిరుద్యోగులు భేషజాలకు పోకుండా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం క్షేమదాయకం. విద్యార్థులకు ఇతర వ్యాపకాలు అధికమవుతాయి. 
 
వృషభం : భాగస్వామిక చర్చలు ప్రశాంతంగా ముగుస్తాయి. ఉద్యోగస్తులు ఒత్తిడి, ప్రలోభాలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం. రావలసిన ధనం అందడంతో మీ ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. అక్షరదోషం వల్ల ప్రింటింగ్ రంగాల వారికి ఇబ్బందులు తప్పవు. తరచూ విందులు, వేడుకల్లో పాల్గొంటారు. 
 
మిథునం : గృహంలో ఒక శుభకార్యానికి అనువైన వాతావరణం నెలకొంటుంది. స్త్రీలకు, వస్త్ర, వస్తుప్రాప్తి. వాహనయోగం వంటి శుభ ఫలితాలుంటాయి. బంధుమిత్రులు ఒత్తిడి, మొహమ్మాటాలకు గురిచేస్తారు. పెంపుడు జంతువుల గురించి ఆందోళన చెందుతారు. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. 
 
కర్కాటకం : విద్యార్థులకు ధ్యేయం పట్ల అవగాహన ఏర్పడుతుంది. నూతన పెట్టుబడులు, వ్యాపారాల విస్తరణలు అనుకూలిస్తాయి. ఆత్మీయుల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. రుణం ఏ కొంతైనా తీర్చాలన్న మీ సంకల్పం నెరవేరుతుంది. మీ సంతానం అత్యుత్సాహం వల్ల చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. 
 
సింహం : అవివాహితుల్లో పను ఆలోచనలు చోటుచేసుకుంటాయి. ఖర్చులు ప్రయోజనకరంగా ఉంటాయి. కొబ్బరి, పండ్లు, పూల, చిరు వ్యాపారులకు పురోభివృద్ధి. మీ అభిప్రాయాలకు మంచిస్పందన లభిస్తుంది. ప్రేమికుల తొందరపాటు నిర్ణయాలు ఇబ్బందులు కలిగిస్తాయి. ఆకస్మిక ఖర్చులు, తప్పనిసరి చెల్లింపుల వల్ల ఇబ్బందులకు గురవుతారు. 
 
కన్య : బంధువుల తాకిడి అధికంగా ఉంటుంది. దైవ దీక్షలు స్వీకరిస్తారు. చేసే ప్రతి పనిలోనూ ఏకాగ్రత ముఖ్యం. కీలకమైన పత్రాలు, రశీదులు అందుకుంటారు. సంతానం, ప్రియతములతో ఉల్లాసంగా గడుపుతారు. ట్రాన్స్‌పోర్టు, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల వారికి సామాన్యం. సన్నిహితులతో కలిసి విహారయాత్రలలో పాల్గొంటారు. 
 
తుల : క్యాటరింగ్ పనివారలకు శుభదాయకం. స్థిరచరాస్తుల క్రయవిక్రయాల్లో పునరాలోచన మంచిది. కోర్టు వ్యవహారాలు వాయిదా పడటంతో ఒకింత నిరుత్సాహానికి గురువుతారు. ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు నిర్మాణ పనులలో ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. 
 
వృశ్చికం : ఆర్థిక పరిస్థితులు క్రమేణా మెరుగుపడుతాయి. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. మీ పథకాలు, ఆలోచనలు, కార్యరూపం దాల్చుతాయి. విద్యార్థులు అనవసర విషయాల పట్ల ఆసక్తి కనబరుస్తారు. భాగస్వామిక చర్చలు ఒప్పందాలకు సంబంధించిన విషయాల్లో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. 
 
ధనస్సు : బ్యాంకింగ్ వ్యవహారాలలో మెళకువ వహించండి. కళ, సాంస్కృతి, బోధన, విదేశీ వ్యవహారాల రంగాలకు చెందిన వారికి ఆర్థికంగా ప్రోత్సహాకరంగా ఉంటుంది. బంధు మిత్రులను కలుసుకుంటారు. మీ శ్రీమతి సలహా పాటించడం వల్ల ఒక సమస్య నుంచి గట్టెక్కుతారు. ముఖ్యుల గురించి అప్రియమైన వార్తలు వినవలసి వస్తుంది. 
 
మకరం : ఆర్థిక సంస్థల నుంచి నిధులు మంజూరవుతాయి. బంధుమిత్రులతో కలిసి ఆలయ సందర్శనం చేస్తారు. ఉత్తర ప్రత్యుత్తరాలు, ఆహార వ్యవహారాల్లో ఏకాగ్రత అవసరం. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ముఖ్యమైన పనులు ఆశించిన రీతిలో పూర్తి చేస్తారు. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాలకు గుర్తింపు లభిస్తుంది. 
 
కుంభం : స్త్రీలకు దైవ, పుణ్యకార్యాలపట్ల ఆసక్తి పెరుగుతుంది. పెద్దలతో మాట పట్టింపులు అధికమవుతాయి. ప్రత్యర్థుల తీరును గమనించి తదనుగుణంగా మెలగండి. వాహనచోదకులకు మెళకువ అవసరం. భాగస్వాముల మధ్య సత్సంబంధాలు నెలకొనివుండగలవు. విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. 
 
మీనం : ఉద్యోగస్తులకు పైఅధికారుల నుంచి ఒత్తిడి, పనిభారం అధికమవుతాయి. స్త్రీలకు ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంటుంది. రిప్రజెంటేటివ్‌లకు నెమ్మదిగా మార్పులు కానవస్తాయి. రాజకీయాలలో వారికి రహస్యపు విరోధులు అధికమవుతున్నారని గమనించండి. రుణాలు చేబదుళ్ళకు యత్నాలు సాగిస్తారు.