బుధవారం, 1 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By raman
Last Updated : సోమవారం, 30 అక్టోబరు 2017 (08:46 IST)

శుభోదయం : రాశిఫలితాలు 30-10-2017

మేషం: ఉద్యోగస్తులకు పెండింగ్ పనులు పూర్తి చేయడంలో సహోద్యోగులు సహకరిస్తారు. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు. మీ సృజనాత్మక శక్తికి, తెలివితేటలకు గుర్తింపు లభిస్తుంది. గృహంలో ఏదైనా వ

మేషం: ఉద్యోగస్తులకు పెండింగ్ పనులు పూర్తి చేయడంలో సహోద్యోగులు సహకరిస్తారు. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు. మీ సృజనాత్మక శక్తికి, తెలివితేటలకు గుర్తింపు లభిస్తుంది. గృహంలో ఏదైనా వస్తువు సమయానికి కనిపించకుండా పోయే ఆస్కారం ఉంది.
 
వృషభం: మీ మంచి కోరుకునేవారు కంటే మీ చెడును కోరేవారే ఎక్కువగా ఉన్నారు. కోర్టు వ్యవహారాలు మీరు కోరుకున్నట్టుగానే వాయిదా పడతాయి. పొదుపు పథకాలపై దృష్టి సారిస్తారు. ఉద్యోగస్తులు అధికారులతో సంభాషించేటప్పుడు మెళకువ అవసరం. కొబ్బరి, పండ్ల, పూల, తినుబండారాల వ్యాపారులకు పురోభివృద్ధి.
 
మిథునం: ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తిన మిత్రుల సహకారం లభిస్తుంది. ఉపాధ్యాయులకు యాజమాన్యం ఒత్తిడి అధికం. ఒక అనుభవం మీకెంతో జ్ఞానాన్ని ఇస్తుంది. పెరిగిన ధరలు, చాలీచాలని ఆదాయంతో సతమతమవుతారు. వస్త్ర వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఎవరికైనా ధనసహాయం చేసినా తిరిగి రాజాలదు.
 
కర్కాటకం: కొన్ని విలువైన వస్తువులు అనుకోకుండా కొనుగోలు చేస్తారు. రేషన్ డీలర్లకు కొత్త సమస్యలు తలెత్తే సూచనలున్నాయి. విద్యార్థులు తోటివారి కారణంగా ఇబ్బందులు ఎదురవుతాయి. ఆధ్యాత్మిక విషయాల పట్ల ఏకాగ్రత వహించలేరు. సోదరి, సోదరులతో అవగాహన కుదరదు. నిరుద్యోగులు ఇంటర్వ్యూల్లో రాణిస్తారు.
 
సింహం: బ్యాంకు వ్యవహారాల్లో పరిచయం లేని వ్యక్తులతో మితంగా సంభాషించండి. భాగస్వమిక చర్చలు ఫలిస్తాయి. ఉద్యోగరీత్యా దూరప్రాంతానికి ప్రయాణం చేయవలసి రావచ్చు. మీ పాత సమస్యలు పరిష్కారం కాకపోవడం ఇబ్బందిగా ఉంటుంది. నిత్యవసర వస్తు వ్యాపారులకు, స్టాకిస్టులకు అభివృద్ధి కానవస్తుంది.
 
కన్య: విదేశాలు వెళ్ళటానికి చేయు యత్నాలు ఫలిస్తాయి. తరచూ సేవ, దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఉద్యోగస్తులకు విధినిర్వహణలో ఏకాగ్రత ఎంతో ముఖ్యం. చిట్స్, ఫైనాన్స్ రంగాల వారికి కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. గత తప్పిదాలు పునరావృతం కాకుండా జాగ్రత్త వహించండి. కోర్టు వాయిదాలు విసుగు కలిగిస్తాయి.
 
తుల: ఏదైనా అమ్మకానికై చేయు ప్రయత్నాలు వాయిదా పడగలవు. ఇతరులకు వాహనం ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. దైవసేవ, పుణ్యకార్యాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. ఊహాగానాలతో కాలం వ్యర్థం చేయకండి. మీ శ్రీమతి వైఖరి మార్పును గమనిస్తారు. వైద్యులకు శస్త్ర చికిత్స వేయునప్పుడు మెళకువ అవసరం.
 
వృశ్చికం: ఉపాధ్యాయులకు, మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికమవుతుంది. చిన్నారుల ఆరోగ్యం కలవరపరుస్తుంది. సంగీత, నృత్య కళాకారులకు ప్రోత్సాహకరం. స్త్రీలకు షాపింగ్‌లో ఏకాగ్రత ప్రధానం. ఊహించని ఖర్చులు మీ అంచనాలు దాటుట వలన ఆందోళన గురవుతారు. ఎదుటివారితో మితంగా సంభాషించడం మంచిది.
 
ధనస్సు : వ్యాపారాల్లో పెరిగిన పోటీ వల్ల స్వల్ప ఆటుపోట్లు తప్పవు. వీలైతే కీలకమైన నిర్ణయాలు ఈ రోజుకు వాయిదా వేయడం మంచిది. స్త్రీలకు బంధువుల నుంచి ఒత్తిడి, మొహమ్మాటాలు ఎదురవుతాయి. పెంపుడు జంతువు పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాల్లో తొందరపాటుతనం విడనాడండి.
 
మకరం: మీ శ్రీమతిలో వచ్చిన మార్పు సంతృప్తినిస్తుంది. వాహనం నడుపుతున్నప్పుడు జాగ్రత్త అవసరం. పెద్దలతో ఏకీభవించలేకపోతారు. రావలసిన ధనం చేతికందుతుంది. పాత వస్తువులను కొని ఇబ్బందులు ఎదుర్కొంటారు. ప్రత్యర్థులు ఇబ్బంది పెట్టే ఆస్కారం ఉంది. చేపట్టిన ఉపాధి పథకాలకు మంచి గుర్తింపు లభిస్తుంది.
 
కుంభం: ప్రింటింగ్ రంగంలోని వారికి అచ్చుతప్పులు దొర్లటం వల్ల పై అధికారుల చేత మాటపడక తప్పదు. మనుష్యుల మనస్తత్వం తెలిసి మసలుకొనుట మంచిది. ఊహించని ఖర్చులు మీ అంచనాలు దాటవచ్చును. పెద్దమొత్తంలో ధనసహాయం మంచిది కాదు. కోర్టు వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి.
 
మీనం: రాజకీయ నాయకులు అధికారుల ఇంటర్వ్యూ కోసం పడిగాపులు తప్పవు. విద్యార్థుల మొండి వైఖరి ఉపాధ్యాయులకు చికాకు కలిగిస్తుంది. బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. కొనుగోలుదార్లను తేలికగా ఆకట్టుకుంటారు. దంపతుల మధ్య అభిప్రాయభేదాలు, కలహాలు చోటుచేసుకుంటాయి.