శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By raman
Last Updated : బుధవారం, 25 అక్టోబరు 2017 (05:49 IST)

శుభోదయం : ఈ రోజు రాశిఫలితాలు 25-10-2017

మేషం : కుటుంబ వ్యక్తులతో స్వల్ప విరోధములు రావొచ్చును.. జాగ్రత్త వహించండి. విదేశీయానం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సభలు, సమావేశాల్లో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. ఎంత ధనం వెచ్చించైనా

మేషం : కుటుంబ వ్యక్తులతో స్వల్ప విరోధములు రావొచ్చును.. జాగ్రత్త వహించండి. విదేశీయానం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సభలు, సమావేశాల్లో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. ఎంత ధనం వెచ్చించైనా కోరుకున్న వస్తువులు దక్కించుకుంటారు. కాని వేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది.
 
వృషభం : గృహాలంకరణ అంశాలపై దృష్టి పెడతారు. దీర్ఘకాలం వాయిదా పడుతున్న పనులు పూర్తి చేస్తారు. మీ ఆలోచనలు పంచుకునే వారి కోసం మనసు తహతహలాడుతుంది. తల, ఎముకలకి సంబంధించిన చికాకులు తలెత్తినా నెమ్మెదిగా సమసిపోగలవు. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి.
 
మిథునం : ఉపాధ్యాయులతో విద్యార్థులు ఏకీభవించలేక పోతారు. వారసత్వపు ఆస్తుల పంపకం జరుగుతుంది. ఉద్యోగస్తులు ఒత్తిడి, ప్రలోభాలకు పోకుండా దూరంగా ఉండటం శ్రేయస్కరం. మీ అభిరుచి ఆశయాలకు తగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. విద్యార్థులకు ప్రేమ విషయాల్లో భంగపాటు తప్పదు.
 
కర్కాటకం : ప్రయాణాల విషయంలో ముందు చూపు ఎంతో అవసరం. విలువైన పత్రాలు, రశీదులు అందుకుంటారు. పెద్దలకు ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి. రావలసిన ధనం వాయిదా పడుతుంది. పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు. నిత్యావసర వస్తు స్టాకిస్టులకు, వ్యాపారులకు సంతృప్తికానవస్తుంది.
 
సింహం : కుటుంబ సౌఖ్యం, వాహనం యోగం పొందుతారు. మీ సంతానం మొండి వైఖరి వల్ల చికాకులు తప్పవు. వివాహ యత్నాలలో సన్నిహితుల నుండి విలువైన సమాచారం అందుకుంటారు. గృహమునకు కావలసిన వస్తువులను అమర్చుకుంటారు. స్త్రీలు ద్విచక్ర వాహనంపై  దూర ప్రయాణాలు మంచిది కాదు అని గమనించండి.
 
కన్య : కుటుంబీకుల మధ్య కొత్త కొత్త విషయాలు చర్చకు వస్తాయి. అందరితో కలిసి విందు వినోదాలలో చురుకుగా పాల్గొంటారు. పాతమిత్రుల కలయికతో గత అనుభవాలు జ్ఞప్తికి వస్తాయి. హోటల్, తినుబండర వ్యాపారస్తులకు సంతృప్తికానవచ్చును. తరచూ సేవ, దైవ కార్యాల్లో పాల్గొంటారు. ప్రయాణాలు వాయిదాపడతాయి.
 
తుల : మీ శ్రీమతి వైఖరి ఆగ్రహం కలిగిస్తుంది. తలపెట్టిన పనుల్లో ప్రోత్సాహం, పురోభివృద్ధి కానవస్తుంది. ఆత్మీయుల రాక సంతోషం కలిగిస్తుంది. దైవకార్యాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. స్త్రీలు అభిప్రాయాలకు ఆమోదం లభించదు. విదేశీయానం కోసం చేసే యత్నాలలో సఫలీకృతులవుతారు. సోదరీ, సోదరులతో ఏకీభవించలేరు.
 
వృశ్చికం : ఎంతో శ్రమించిన మీదటగానీ అనుకున్న పనులు పూర్తికావు. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. విద్యార్థులకు పాఠ్యాంశాల పట్ల ఆసక్తి సన్నగిల్లుతుంది. నూతన పరిశ్రమలు, వ్యాపార విస్తరణలు అనుకూలిస్తాయి. బ్యాంకింగ్ వ్యవహారాల్లో మెలకువ వహించండి. మిత్రులు మీ యత్నాలకు సహకరిస్తారు.
 
ధనస్సు : వ్యాపారాభివృద్ధికి కొత్తకొత్త పథకాలు రూపొందిస్తారు. దైవ, సేవా కార్యక్రమాలకు దానధర్మాలు చేయడం వల్ల మీ కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. కొంతమంది మీ నుంచి కీలకమైన విషయాలు రాబట్టేందుకు యత్నిస్తారు. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు చేపట్టవలసి ఉంటుంది. స్త్రీలకు పనివారలతో చికాకులు తప్పవు.
 
మకరం : దీక్షలు, దైవకార్యాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. బంధుమిత్రులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. రిప్రజెంటేటివ్‌‌లు తమ టార్గెట్లను అతికష్టంమ్మీద పూర్తి చేస్తారు. బ్యాంకు వ్యవహారాల్లో అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి.
 
కుంభం : పండ్లు, పూల, కొబ్బరి వ్యాపారస్తులకు పురోభివృద్ధి. ఏజెంట్లు, బ్రోకర్లకు ఒత్తిడి, శ్రమ అధికమవుతాయి. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాలకు మంచి స్పందన లభిస్తుంది. వాహనం అమర్చుకోవాలనే మీ కోరిక నెరవేరుతుంది. కోర్టు వ్యవహారాలు, ఆస్తి తగాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.
 
మీనం : ఆర్థిక లావాదేవీలు సమర్థంగా నిర్వహిస్తారు. వృత్తిపరంగా ఎదురైన సమస్యల నుంచి బయటపడతారు. లౌక్యంగా వ్యవహరించి ఒక అవకాశాన్ని మీకు అనుకూలంగా మలుచుకుంటారు. రేషన్ డీలర్లకు అధికారుల నుంచి ఇబ్బందులెదురవుతాయి. సోదరుల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు.