శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By raman
Last Updated : ఆదివారం, 5 నవంబరు 2017 (08:24 IST)

శుభోదయం : 05-11-17నాటి దినఫలాలు

మేషం : రాజకీయ నేతలు వేదికలను అన్వేషిస్తారు. రియల్ ఎస్టేట్ రంగాల వారికి ఆశించినంత పురోభివృద్ధి ఉండదు. ఒక స్థిరాస్తి అమర్చుకోవాలనే ఆలోచన స్ఫురిస్తుంది. అకాలభోజనం, శారీకశ్రమ, మితిమీరిన ఆలోచనల వల్ల అనారోగ

మేషం : రాజకీయ నేతలు వేదికలను అన్వేషిస్తారు. రియల్ ఎస్టేట్ రంగాల వారికి ఆశించినంత పురోభివృద్ధి ఉండదు. ఒక స్థిరాస్తి అమర్చుకోవాలనే ఆలోచన స్ఫురిస్తుంది. అకాలభోజనం, శారీకశ్రమ, మితిమీరిన ఆలోచనల వల్ల అనారోగ్యానికి గురవుతారు. గతంలో పోగొట్టుకున్నది తిరిగి దక్కించుకుంటారు.
 
వృషభం : దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. స్త్రీలు కొన్ని విషయాలను పట్టించుకోకపోవడం మంచిది. గృహ ప్రశాంతతకు భంగం కలిగే సూచనలు ఉన్నాయి. కుటుంబీకులతో కలిసి విందుల్లో పాల్గొంటారు. మీ ఆశయ సిద్ధికి బంధువులు సహకరిస్తారు. వనసమారాధనలు, శుభకార్యాల్లో అందరినీ ఆకట్టుకుంటారు.
 
మిథునం : ఆర్థిక వ్యవహారాలలో ఆటుపోట్లు తొలగుతాయి. వస్త్ర, బంగారం వ్యాపారులకు పనివారలతో చికాకులు తప్పవు. విదేశీయానం, రుణ యత్నాలు ఫలిస్తాయి. దూర ప్రయాణాలలో వస్తువుల పట్ల మెళకువ అవసరం. ఆత్మీయుల ఆహ్వానం ఆలోచింపజేస్తుంది. కొత్త బాధ్యతలు బలవంతంగా స్వీకరించాల్సి వస్తుంది.
 
కర్కాటకం : ఆర్థిక వ్యవహారాలలో భాగస్వామిక వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. విద్యార్థులు క్రీడా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. రావలసిన ధనం చేతికందుతుంది. స్త్రీలు వనసమారాధనల్లో పాల్గొంటారు. పుణ్యక్షేత్ర సందర్శనాలలో మానసికంగా కుదుటపడుతారు.
 
సింహం : మీపట్ల ముభావంగా ఉండే వ్యక్తులు మీ సాన్నిత్యం కోరుకుంటారు. ఉద్యోగస్తులు విశ్రాంతికై చేయుయత్నాలు అనుకూలిస్తాయి. వైద్యులు ఆపరేషన్లు చేయునపుడు ఏకాగ్రత చాలా అవసరం. బంధుమిత్రులు మీ నుంచి ధన సాహాయం ఆశిస్తారు. కొన్ని బంధాలు మీకు అనుకూలంగా మారి మిమ్మల్ని ఆనందంలో ముంచెత్తుతాయి.
 
కన్య : సంగీత, సాహిత్య, కళా, రంగాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీకోసం, మీకుటుంబీకుల కోసం ధనం బాగుగావెచ్చిస్తారు. పత్రికా సంస్థలలోని వారు ఎంతో జాగ్రత్తగా వ్యవహరించినా పొరపాట్లు జరగకమానవు. రాజకీయ నాయకులు, సభలు, సమావేశాలు, వేడుకల్లో పాల్గొంటారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పాడతాయి.
 
తుల : ఆర్థిక ఇబ్బంది అంటూ ఏదీ ఉండదనే చెప్పొచ్చు. మీ ఆగ్రహావేశాలు అదుపులో ఉంచుకోవడం క్షేమదాయకం. దుబారా ఖర్చులు తగ్గించాలన్న మీ ఆలోచన ఫలిస్తుంది. కష్టసమయంలో బంధువులు అండగా నిలుస్తారు. సంఘంలో పెద్ద మనుషులతో పరిచయాలు లభిస్తాయి. విద్యార్థులకు ఒత్తిడి, చికాకులు అధికం.
 
వృశ్చికం : వృత్తివ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఇతరుల నుంచి సహాయం అర్థించి భంగపాటుకు గురవుతారు. స్త్రీలకు నరాలు, దంతాలు, ఎముకలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి. నిరుద్యోగులకు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది. కాంట్రాక్టు విషయంలో పునరాలోచన అవసరం.
 
ధనస్సు : కొబ్బరి, పండ్లు, పూల, హోటల్, తినుబండరాల వ్యాపారులకు పురోభివృద్ధి కానవస్తుంది. పారిశ్రామిక రంగంలోని వారికి కార్మిక, విద్యుత్ లోపం వంటి ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. స్త్రీలు, ఓర్పు, నేర్పుతో వ్యవహరిస్తూ సత్ఫలితాలు పొందుతారు. ఉపాధ్యాయులకు యాజమాన్యం ధోరణి నిరుత్సాహపరుస్తుంది.
 
మకరం : ముఖ్యుల ద్వారా మీ పనులు నెరవేర్చుకొనుటకై చేయుయత్నాలు ఫలిస్తాయి. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాల్లో వారికి అనుకూలమైనకాలం. గృహంలో మార్పులు, చేర్పులు కొంత అసౌకర్యాన్ని కలిగిస్తాయి.
 
కుంభం : ప్రేమికుల మధ్య విభేదాలు తలెత్తుతాయి. నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షల్లో ఏకాగ్రత ముఖ్యం. రుణ యత్నాల్లో ప్రతికూలత ఎదుర్కొంటారు. స్త్రీలకు ఆరోగ్యంలో చికాకులు తలెత్తవచ్చు. మెళకువ వహించండి. కొబ్బరి పండ్లు, పూల వ్యాపారులకు కలిసివచ్చే కాలం. సన్నిహితులతో కలిసి విహార యాత్రల్లో పాల్గొంటారు.
 
మీనం : కుటుంబంలో కొందరి ప్రవర్తన వల్ల మనసు వికలమవుతుంది. ఉద్యోగస్తులు ప్రలోభాలకు దూరంగా ఉండటం మంచిది. ప్రముఖుల కలయిక సాధ్యం కాకపోవచ్చు. ఉత్తర ప్రత్యుత్తరాలు, ఆహార వ్యవహారాల్లో ఏకాగ్రత అవసరం. ఇతరులను సాయం చేసి ఆదుకోవాలనే తలంపుతో చిక్కులు కొని తెచ్చుకునే ప్రమాదం ఉంది.