సోమవారం, 6 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By raman
Last Updated : గురువారం, 9 నవంబరు 2017 (09:48 IST)

శుభోదయం : 09-11-2017 దినఫలితాలు

మేషం: ఆదాయానికి తగినట్లు ఖర్చులు వుంటాయి. పాత వస్తువులు కొనడానికి చేయు ప్రయత్నాలు ఫలించగలవు. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి మంచి గుర్తింపు లభిస్తుంది. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుం

మేషం: ఆదాయానికి తగినట్లు ఖర్చులు వుంటాయి. పాత వస్తువులు కొనడానికి చేయు ప్రయత్నాలు ఫలించగలవు. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి మంచి గుర్తింపు లభిస్తుంది. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. స్త్రీలను పనిభారం అధికమవుతుంది. 
 
వృషభం: రాజకీయనాయకులకు మంచి పేరు, ఖ్యాతి లభిస్తుంది. మీ శ్రీమతిలో మార్పు మీకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఉద్యోగస్తులకు పనిభారం అధికమవుతుంది. ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. రావలసిన ధనం చేతికి అందుతుంది. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్ల వ్యవహారంలో ఆటంకాలు ఎదుర్కోవలసివస్తుంది.
 
మిథునం: స్త్రీలకు కళ్ళు, తల, నరాలకు సంబంధించిన చికాకులు తప్పవు. చిన్ననాటి స్నేహితులనుంచి వచ్చిన ఆహ్వానాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. రుణంలో కొంచెం మొత్తమైనా తీర్చాలనే మీ యత్నం ఫలిస్తుంది. సొంతంగా వ్యాపారం చేయాలనే మీ ధ్యేయం కార్యరూపం దాల్చుతుంది. ప్రయాణాల్లో మెళకువ అవసరం.
 
కర్కాటకం: ఇంట్లో మార్పులు, చేర్పులు అసౌకర్యాన్ని కలిగిస్తాయి. రుణవిముక్తులు కావడంతో పాటు తాకట్టు విడిపించుకుంటారు. నమ్మకం, పట్టుదలతో శ్రమించండి. అనుకున్నది సాధిస్తారు. విషయ పరిజ్ఞానం లేనివారితో వాదనలకు దిగడం మంచిది కాదు. ప్రతి విషయంలోను సర్దుకుపోయే విధంగా వ్యవహరించాల్సి వుంటుంది.
 
సింహం: మీ ఆశయాలు, అభిరుచికి తగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. బ్యాంకు వ్యవహారాల్లో ఏకాగ్రత అవసరం. విద్యార్థినులకు వాహనం నడుపుతున్నప్పుడు ఏకాగ్రత ముఖ్యం. ఉద్యోగస్తులు అధికారులతో సంభాషించునపుడు జాగ్రత్త అవసరం. ఏదైనా విలువైన స్థిరాస్తి అమర్చుకోవాలనే మీ కోరిక నెరవేరుతుంది. 
 
కన్య: ఉద్యోగస్తులు తోటివారి కారణంగా అధికారులతో మాటపడవలసివస్తుంది. గృహంలో ప్రశాంతత నెలకొంటుంది. బ్యాంకు వ్యవహారాల్లో అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. ఆలయాలను సందర్శిస్తారు. మీ కళత్ర మొండివైఖరి మీకు చికాకు  కలిగిస్తుంది. విద్యార్థులు ఉపాధ్యాయులతో ఏకీభవించలేకపోతారు.
 
తుల : వ్యాపారాల అభివృద్ధికి కొత్త కొత్త ప్రణాళికలు రూపొందిస్తారు. శస్త్ర చికిత్స చేయునపుడు వైద్యులకు మెళకువ అవసరం. మీ సోదరుల మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. దంపతుల మధ్య అవగాహనలోపం వంటివి ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి.
 
వృశ్చికం: ఆర్థిక వ్యవహారాలు గోప్యంగా ఉంచడం క్షేమదాయకం. రిప్రజెంటివ్‌లకు, ఉపాధ్యాయులకు సదవకాశాలు లభించగలవు. మందులు, రసాయనిక, సుగంధద్రవ్య వ్యాపారస్తులకు సామాన్యంగా ఉంటుంది. కోర్టు వ్యవహారాలు వాయిదా పడటం మంచిది. మీ చుట్టు పక్కల వారి ధోరణి మీకెంతో ఆశ్చర్యం కలిగిస్తుంది.
 
ధనస్సు: రాజకీయాల్లో వారికి రహస్యపు విరోధులు అధికం అవుతున్నారని గమనించండి. ఆధ్యాత్మిక, సాంఘిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీ శ్రీమతికి మీరంటే ప్రత్యేకాభిమానం కలుగుతుంది. రుణం కొంత మొత్తం తీర్చటంతో ఒత్తిడి నుండి కుదుటపడతారు. ప్రముఖులకు విలువైన కానుకలు ఇచ్చి వారిని ప్రసన్నం చేసుకుంటారు.
 
మకరం: ప్రభుత్వ కార్యాలయాల్లోని పనులు అనుకూలిస్తాయి. స్త్రీలకు పనివారితో చికాకులు అధికమవుతాయి. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. శత్రువులు మిత్రులుగా మారి సహకారం అందిస్తారు. వాహనం నడుపుతున్నప్పుడు మెళకువ అవసరం. ఉద్యోగ రీత్యా దూర  ప్రయాణాలు చేయవలసివస్తుంది. 
 
కుంభం: కుటుంబ అవసరాలు పెరగడంతో అదనపు సంపాదన కోసం యత్నాలు చేస్తారు. స్త్రీల అభిప్రాయాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. మిత్రుల కలయికతో మానసికంగా కుదుటపడతారు. ఆస్తి వ్యవహారాలకు సంబంధించి సోదరీ సోదరులతో ఒక అవగాహన కుదుర్చుకుంటారు. నిరుద్యోగులకు అవకాశాలు లభిస్తాయి.
 
మీనం: ఏదైనా పరిశ్రమలు, సంస్థలు స్థాపించాలనుకునే మీ ఆశయం త్వరలోనే కార్యరూపం దాల్చుతుంది. ఉపాధ్యాయులకు, ప్రైవేట్ సంస్థల్లోని వారికి ఓర్పు, అంకితభావంతో పనిచేయాల్సి వుంటుంది. బ్యాంకు పనుల్లో ఏకాగ్రత వహించండి. స్త్రీలకు కాళ్ళు, నడుము, నరాలకు సంబంధించిన సమస్యలు ఎదుర్కొంటారు.