బుధవారం, 1 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By raman
Last Updated : ఆదివారం, 19 నవంబరు 2017 (08:02 IST)

ఆదివారం రాశిఫలాలు... చిక్కుల్లో పడే ఆస్కారం

మేషం: పాత మిత్రుల కలయిక ఉత్సాహాన్ని ఇస్తుంది. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. నిరుద్యోగుల బోగస్ ప్రకటనల వల్ల మోసపోయే ఆస్కారం వుంది. గృహోపకరణాలను అమర్చుకుంటారు. మీ సంతానం వైఖరి చికాకు పరు

మేషం: పాత మిత్రుల కలయిక ఉత్సాహాన్ని ఇస్తుంది. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం  సందర్శిస్తారు. నిరుద్యోగుల బోగస్ ప్రకటనల వల్ల మోసపోయే ఆస్కారం వుంది. గృహోపకరణాలను అమర్చుకుంటారు. మీ సంతానం వైఖరి చికాకు పరుస్తుంది. రాజకీయనాయకులకు ఆకస్మిక ప్రయాణాలు ఇబ్బంది కలిగిస్తాయి.
 
వృషభం: ప్రేమికులు అతిగా వ్యవహరించడం వల్ల చిక్కుల్లో పడే ఆస్కారం వుంది. స్త్రీలకు ఇరుగు పొరుగు వారితో సఖ్యత అంతగా ఉండదు. ఖర్చులు, కుటుంబ అవసరాలు మరింతగా పెరుగుతాయి. స్త్రీలు వాగ్విదాలకు దూరంగా వుండటం మంచిది. బంధువుల నుంచి ఒక ముఖ్య సమాచారం అందుతుంది.
 
మిథునం: బంధువుల రాకతో పనులు వాయిదా పడతాయి. కీలకమైన వ్యవహరాల్లో మెలకువ వహించండి. దైవ, సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. కుటుంబీకులతో అవగాహన లోపిస్తుంది. మీ ముఖ్యుల కోసం ధనం బాగుగా వెచ్చించవలసి ఉంటుంది. కొత్త ప్రదేశ సందర్శనల పట్ల ఆసక్తి ఏర్పడుతుంది.
 
కర్కాటకం: పోగొట్టుకున్న వస్తువులు అతికష్టంమ్మీద రాబట్టుకుంటారు. నిరుద్యోగులకు సదవకాశాలు లభించిన తొందరపాటుతనంతో జారవిడుచుకుంటారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. విందులు, వినోదాల్లో మితంగా వ్యవహరించండి. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు బలపడతాయి.
 
సింహం : మీ విలువైన వస్తువుల విషయంలో మెలకువ వహించండి. బంధుమిత్రులను కలుసుకుంటారు. కుటుంబ అవసరాలు పెరగడంతో అదనపు సంపాదన కోసం యత్నాలు చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగస్తులు అధికారుల నుంచి ఒత్తిడి, ఇతరత్రా చికాకులు వంటివి ఎదుర్కొంటారు.
 
కన్య: సహకార సంఘాల వారికి చిన్నతరహా, రాజకీయాల్లోని వారికి అశాంతి అధికమవుతుంది. ట్రాన్స్‌పోర్ట్, ఆటోమొబైల్, మెకానిక్  రంగాల వారికి బరువు బాధ్యతలకు అధికమవుతాయి. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. ఏ విషయంలోను ఒంటెత్తు పోకడ మంచిది కాదు. రేపటి సమస్య గురించి అధికంగా ఆలోచిస్తారు.
 
తుల: బ్యాంకు పనుల్లో ఏకాగ్రత అవసరం. రాజకీయనాయకులు సభ, సమావేశాల్లో పాల్గొంటారు. పెద్దల ఆరోగ్యం మెరుగుపడటంతో మానసిక ప్రశాంతత పొందుతారు. ఆప్తులను సంప్రదించి కొన్ని కార్యక్రమాలు నిర్ణయాలకు తీసుకుంటారు. బంధువులను కలుసుకుంటారు. ద్విచక్ర వాహనం నడుపునప్పుడు మెళకువ అవసరం.
 
వృశ్చికం: మీ శక్తి సామర్థ్యాలపై మీకు నమ్మకం ఏర్పడుతుంది. సినీ కళాకారుల వల్ల రాజకీయాల్లో పెనుమార్పులు చోటుచేసుకుంటాయి. మీ శ్రీమతి ఆరోగ్యంలో ఇబ్బందులు ఎదుర్కొనవలసివస్తుంది. ఉత్తర ప్రత్యుత్తరాలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. మీ ఉన్నతిని చూసి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి.
 
ధనస్సు: ప్రయాణాల్లో ఒత్తిడి, చికాకులు వంటివి ఎదుర్కొంటారు. ఆలయ సందర్శనాల్లో చురుకుగా పాల్గొంటారు. కొబ్బరి,  పండ్ల, పూల, పానీయ వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. కుటుంబీకుల నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటారు. మీ హోదా చాటుకోవటానికి ధనం విరివిగా వ్యయం చేయాల్సి వస్తుంది.
 
మకరం: వన సమారాధనలు, వేడుకలకు ప్రణాళికలు రూపొందిస్తారు. సంఘంలో మీ కీర్తి, ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. ఉమ్మడి వ్యాపారాల వల్ల సమస్యలు తలెత్తవచ్చు. స్త్రీలకు పనివారితో ఇబ్బందులు తప్పవు. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. ఏ వ్యక్తినీ అతిగా విశ్వసించడం మంచిది కాదు.
 
కుంభం: వ్యాపారాల అభివృద్ధికి చేపట్టిన పథకాలు మునుముందు మంచి ఫలితాలనిస్తాయి. స్త్రీలకు నరాలు, ఎముకలు, దంతాలకు సంబంధించిన సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. మీ దురదృష్టానికి మిమ్ములను మీరే నిందించుకుంటారు. మిత్రులతో  కలిసి ఉల్లాసంగా గడుపుతారు. విద్యార్థులకు క్రీడల పట్ల ఆసక్తి అధికమవుతుంది.
 
మీనం: విదేశాలు వెళ్ళాలనే కోరిక అధికమవుతుంది. ఆలయ సందర్శనాల్లో చురుకుగా పాల్గొంటారు. ప్రముఖుల కలయిక ప్రయోజనకరంగా ఉంటుంది. మీ సంతానం కోసం షాపింగ్ చేస్తారు. స్త్రీలు తమ వాక్చాతుర్యంతో అనుకున్నది సాధిస్తారు. సోదరీ, సోదరులు సన్నిహితులతో ప్రయాణాలు ఉల్లాసం కలిగిస్తాయి.