ఆదివారం, 10 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : గురువారం, 8 ఆగస్టు 2024 (16:34 IST)

నాగ పంచమి రోజు.. సిద్ధయోగం, రవియోగం..

Nagapanchami
నాగ పంచమి రోజున పూజ ఉత్తమ ఫలితాలు లభిస్తాయి. నాగులు లేదా సర్ప దేవతలను ఈ రోజున పూజిస్తే నాగ దోషాలు తొలగిపోతాయి. ఈ పండుగ శ్రావణ మాసంలోని ఐదవ రోజున జరుపుకుంటారు. ఈ కాలంలో నాగులను పూజించడం వల్ల పరమశివుడు సంతోషిస్తాడని, ఆ తర్వాత వారికి సంతోషం, శ్రేయస్సును ప్రసాదిస్తాడని భక్తుల నమ్మకం. 
 
జ్యోతిష్య శాస్త్ర పరంగా నాగ పంచమి రోజు అనేక గ్రహాల కలయిక కూడా ఉంది. శుక్రుడు-బుధుడు, కుజుడు-గురు గ్రహాల కలయిక కూడా ఉంది. సూర్యుడు కర్కాటక రాశిలో ఉన్నాడు. ఇక శని కూడా కుంభ రాశిలో ఉండడం వల్ల శశ రాజయోగం ఏర్పడుతుంది. సింహ రాశిలో శుక్రుడు, బుధుడు కలిసి లక్ష్మీనారాయణ రాజయోగాన్ని సృష్టిస్తున్నారు. అదే సమయంలో రాహువు మీన రాశిలో, కేతువు చంద్రుడికి చెందిన కన్యా రాశిలో ఉన్నారు. 
 
నాగ పంచమి రోజున సిద్ధయోగం, రవియోగం, సధ్య యోగంతో పాటు హస్తా నక్షత్రం, చిత్తా నక్షత్రాలు ఏర్పడుతున్నాయి. నాగ పంచమి నాడు శని, గురు, బుధ, కుజుడు, సూర్యుడు, శుక్రుడి సంచారం వుంటుంది.