మంగళవారం, 5 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 23 అక్టోబరు 2020 (18:33 IST)

పచ్చ కర్పూరానికి అంత శక్తి వుందా? ఇలా చేశారంటే..?

Pacha Karpooram
ఇంట్లోని దుష్టశక్తులను తొలగించుకోవడం కోసం పచ్చ కర్పూరాన్ని వాడటం మంచిది. పచ్చకర్పూరం నుంచి వచ్చే సువాసన ద్వారా ఇంట్లో శ్రీలక్ష్మీ దేవి నివాసం వుంటుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.

దేవుని పటాల ముందు ముఖ్యంగా లక్ష్మీదేవి ముందు గాజు పాత్రలో నీటిని పోసి పచ్చకర్పూరాన్ని అందులో వేసి.. పసుపును చిటికెడు చేర్చి వుంచాలి. ఆ నీటిని రోజూ లేదా రెండు రోజులకు ఓసారి మారుస్తూ వుండాలి. ఇలా చేస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. 
 
సంపదను ఆకర్షించే శక్తి పచ్చకర్పూరానికి వుంది. పచ్చకర్పూరాన్ని ఓ పసుపు వస్త్రంలో మూటలా కట్టుకుని.. ఇంటికి కుబేర స్థానంలో వుంచి ధూపమేస్తూ వస్తే.. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి.

ఈ పచ్చ కర్పూరాన్ని ఇంటి ప్రధాన గుమ్మానికి కట్టడం, పూజగదిలో వుంచి పూజించడం ద్వారా మానసిక ప్రశాంతత చేకూరుతుంది. పచ్చకర్పూరం ఓ ముక్కను పేపర్లో మడత పెట్టి.. పర్సులో వుంచుకుంటే.. ధనాదాయం పెరుగుతుంది. 
 
ఇంట్లో జరిగే శుభకార్యాలకు పచ్చ కర్పూరాన్ని వాడడం మంచిది. అలాగే వ్యాపారం చేపట్టే ప్రాంతాల్లోనూ, బీరువాల్లో పచ్చకర్పూరాన్ని వుంచడం ద్వారా ఈతిబాధలుండవు.

పచ్చకర్పూరాన్ని శ్రీ మహాలక్ష్మీ దేవి పటానికి లేదా ప్రతిమకు ముందు ఓ చిన్నపాటి బౌల్‌లో వుంచడం ద్వారా సకల అభీష్టాలు సిద్ధిస్తాయని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు.