బుధవారం, 25 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By Selvi
Last Updated : సోమవారం, 24 జులై 2017 (16:48 IST)

నిమ్మ పండు ఇంట్లో వుంటే? నిమ్మపండుతో దిష్టి తీస్తే...

పండ్లలో నిమ్మపండుకు ఎప్పుడూ జీవముంటుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. మంగళప్రదానికి నిమ్మపండు ప్రతీక. నిమ్మపండు ఆరోగ్యరీత్యా మేలు చేయడంతో పాటు ఆధ్యాత్మికపరంగానూ ఉపయోగపడుతుంది. నిమ్మలోని గుణాలు.. దా

పండ్లలో నిమ్మపండుకు ఎప్పుడూ జీవముంటుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. మంగళప్రదానికి నిమ్మపండు ప్రతీక. నిమ్మపండు ఆరోగ్యరీత్యా మేలు చేయడంతో పాటు ఆధ్యాత్మికపరంగానూ ఉపయోగపడుతుంది. నిమ్మలోని గుణాలు.. దాన్ని ఉపయోగించడం ద్వారా ఆధ్యాత్మిక ప్రయోజనాలేంటో చూద్దాం.. పసుపు మంగళకరమైన రంగు. పసుపు రంగు పాజిటివ్ ప్రభావాన్ని ఇస్తాయి.
 
ఈ రంగులో ఉండే నిమ్మపండు సకల శుభాలను అందిస్తుంది. అధర్వణ వేదంలో తొలుత దేవతలు, అధిదేవతలకు పరిహార పూజ చేసేటప్పుడు నిమ్మపండును బలి ఇవ్వడం ఆనవాయితీ అని చెప్పబడింది. అందుకు కారణం ఏమిటంటే.. నిమ్మ పండును జీవపండుగా పిలవడమే. 
 
సజీవంగా ఎప్పుడూ వుండే గుణం నిమ్మలో వుంది. సైన్స్ ప్రకారం చూస్తే.. నిమ్మలో సిట్రస్ ఆమ్లాలున్నాయి. ఈ సిట్రిక్ ఆసిడ్ క్రిమినాశినిగా పనిచేస్తుంది. పిత్త, కఫ వ్యాధులను నయం చేస్తుంది. నిమ్మ చెట్టు ఇంట్లో వుంటే వైద్యుల వద్దకు వెళ్లాల్సిన అవసరం ఉండదని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు. 
 
అలాగే నిమ్మపండును ఇంటి ప్రధాన ద్వారానికి కట్టి వుంచితే నెగటివ్ ఎనర్జీ దూరమవుతుంది. నిమ్మను కట్ చేసి కుంకుమ అద్ది ఇంటి ద్వారానికి ఇరువైపులా  వుంచితే.. నెగటివ్ ఎనర్జీ దూరమవుతుంది. కంటి దృష్టి లోపాలు తొలగిపోతాయి. నిమ్మపండుతో దిష్టి తీసివేయడం ద్వారా దృష్టిలోపాలు తీరిపోతాయి.