1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
  4. The Demonic Bath that destroys positive energy, what is this bath?

Positive Energyని నాశనం చేసే రాక్షస స్నానం, ఏమిటి ఈ స్నానం?

headbath
శాస్త్రాల ప్రకారం మానవులు చేసే స్నానాలను నాలుగు రకాలుగా విభజించారు. ఇప్పటి బిజీ జీవితాల్లో చాలామంది మొదటి రెండు రకములైన ఉత్తమ స్నానాలను చేయడం సాధ్యం కావడంలేదని చెప్తుంటారు. ఇక మూడోరకమైన స్నానం కాస్త అటుఇటూ ఆచరిస్తున్నారు. ఎక్కువగా చేస్తున్నది మాత్రం రాక్షస స్నానాలే వుంటున్నాయి. 
 
అసలు 'రాక్షస స్నానం' అంటే ఏమిటి?
హిందూ సాంప్రదాయం, పురాణాల ప్రకారం, సూర్యోదయం అయిపోయిన చాలా సేపటికి... అంటే ఉదయం 8 లేదా 9 గంటల తర్వాత ఆలస్యంగా నిద్రలేచి, అప్పటివరకు స్నానం చేయకుండా కాలం గడిపి, ఆ రోజూ చేసే మొదటి స్నానాన్ని 'రాక్షస స్నానం' అంటారు. 
 
సమయాన్ని బట్టి ఉదయకాల స్నానాలను ప్రధానంగా నాలుగు రకాలుగా విభజించారు
బ్రాహ్మ స్నానం: తెల్లవారుజామున 4 నుండి 5 గంటల మధ్య చేసేది (అత్యంత ఉత్తమం).
దేవ స్నానం: ఉదయం 5 నుండి 6 గంటల మధ్య చేసేది (ఉత్తమం).
మానుష స్నానం: ఉదయం 6 నుండి 8 గంటల లోపు చేసేది (సాధారణ మనుషులు చేసేది).
రాక్షస స్నానం: ఉదయం 8 లేదా 9 గంటల తర్వాత ఆలస్యంగా చేసే మొదటి స్నానం.
 
రాక్షస స్నానం వల్ల కలిగే ప్రతికూల ఫలితాలు ఎలా వుంటాయంటే...? తామసిక గుణాలు పెరగుతాయి. ఆలస్యంగా నిద్రలేవడం, చాలా సేపటి వరకు స్నానం చేయకుండా అలాగే ఉండటం వల్ల శరీరంలో బద్ధకం, నిర్లిప్తత, ప్రతికూల ఆలోచనలు పెరుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. హిందూ సంప్రదాయంలో ఉదయం వేళ చేసే పూజలు, ధ్యానానికి ఒక ప్రత్యేక సమయం ఉంటుంది. ఆలస్యంగా స్నానం చేయడం వల్ల ఆ పవిత్ర సమయాన్ని కోల్పోయి, పూజకు అనర్హులవుతారు.
 
సకారాత్మక శక్తి... అంటే Positive Energy లోపిస్తుంది. ఉదయాన్నే స్నానం చేయడం వల్ల ఇంట్లో, శరీరంలో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ఆలస్యం చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గి, ఇంట్లో అశాంతి ప్రవేశిస్తుందని పెద్దల నమ్మకం. ఉదయాన్నే స్నానం చేయడం వల్ల నాడీ వ్యవస్థ ఉత్తేజితమై, రక్తప్రసరణ మెరుగవుతుంది. తద్వారా మెదడు చురుగ్గా మారుతుంది. అదే ఆలస్యంగా స్నానం చేస్తే ఆ రోజంతా ఏదో తెలియని మగత, బద్ధకం ఆవహిస్తాయి.
 
రాత్రంతా శరీరం నుండి విడుదలయ్యే చెమట, జిడ్డు, చనిపోయిన చర్మ కణాలు ఉదయాన్నే శుభ్రం చేసుకోకపోతే చర్మ రంధ్రాలు మూసుకుపోతాయి. దీనివల్ల బ్యాక్టీరియా చేరి దురదలు, మొటిమలు లేదా ఒంటి దుర్వాసన రావడం జరుగుతుంది. ఉదయం ఆలస్యంగా స్నానం చేయడం వల్ల మన బ్రేక్‌ఫాస్ట్ టైమింగ్స్ మారతాయి. పనులన్నీ ఆలస్యంగా ప్రారంభం కావడం వల్ల ఆఫీసుకో లేదా బయటికో హడావిడిగా వెళ్లాల్సి వస్తుంది. ఇది అనవసరమైన మానసిక ఒత్తిడికి దారితీస్తుంది.
About Writer
జయ
Content provider.... మరింత చదవండి
తర్వాతి కథనం
10-06-2026 బుధవారం ఫలితాలు- విశేష ఫలితాలున్నాయి