1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
  4. Vaisakhi 2026: Importance, History and Rituals, Astami puja

వైశాఖ మాసం.. అష్టమి రోజున కాలభైరవ పూజ చేస్తే.. కుంకుమ దానంతో...?

Puja
Puja
వైశాఖ మాసానికి మాధవ మాసం అని పేరు. శ్రీ మహా విష్ణువుకు ప్రీతికరమైన ఈ వైశాఖ మాసంలో తులసీ దళాలతో శ్రీ విష్ణువు, లక్ష్మీదేవితో కలిపి పూజించిన వారికి ముక్తి దాయకం. ఈ మాసంలో యజ్ఞాలకు, తపస్సులకు పూజాదికాలకు, దానధర్మాలకు ఎంతో ఎక్కువ ఫలమిస్తాయి. ఈ మాసంలో రావి చెట్టుకు పూజలు చేయడం విశేష ఫలితాలినిస్తాయి. వైశాఖంలో జలదానం, అన్నదానం చేయడం కర్మలను తొలగిస్తుంది. 
 
ఈ మాసంలో శివునికి ధారపాత్ర ద్వారా అభిషేకం జరిగేలా ఏర్పాటు చేయడం శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ మాసంలో చలివేంద్రాలు, పితరులకు, దేవతలకు మనుషులకు అందరికి ఇష్టమైనదే. త్రిమూర్తులను తృప్తిపరుస్తుంది. పూర్వీకులంతా పుణ్యలోకాన్ని పొందుతారు. 
 
ఈ కాలంలో లభించే మామిడి పండ్లను దానం చేయడం ద్వారా పితృ దోషాలు తొలగిపోతాయి. పానకం నిండిన కుండను దానం చేయడం, దోసపండు, బెల్లం, చెరకు గడలు దానం వలన సమస్త పాపాలు తొలగిపోతాయి. మహిళలు కుంకుమ దానం చేయడం విశేష ఫలితాలు లభిస్తాయి. 
 
భర్తకు దీర్ఘాయువు కలుగుతాయి. తాంబూలం దానం చేయడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. మజ్జిగ, నారికేళం ద్వారా చేయడం ద్వారా విద్యాప్రాప్తి, పితృదేవతలు నరకబాధల నుండి విముక్తి పొందుతారు. పెరుగు అన్నం దానం చేయడం ద్వారా కర్మలు తొలగిపోతాయి. అలాంటి వైశాఖ అష్టమి రోజున కాలభైరవ పూజ చేయడం, వారాహి పూజ చేయించడం ద్వారా సర్వాభీష్టాలు చేకూరుతాయి. 
About Writer
సెల్వి
తర్వాతి కథనం
24-04-2026 శుక్రవారం ఫలితాలు - పొదుపు ధనం అందుకుంటారు.