1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
  4. Today 23-04-2026 Your Daily Horoscope

23-04-2026 గురువారం ఫలితాలు - మీ కష్టం ఫలిస్తుంది

Daily Horoscope
Daily Horoscope
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
నిర్విరామంగా శ్రమిస్తారు. సన్నిహితుల వ్యాఖ్యలు ఉత్సాహపరుస్తాయి. వ్యవహారంలో సముచిత నిర్ణయం తీసుకుంటారు. మీ కష్టం ఫలిస్తుంది. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తిచేస్తారు. అందరితోను మితంగా సంభాషించండి, ఇతర విషయాలు పట్టించుకోవద్దు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
అన్నివిధాలా అనుకూలమే. వ్యవహార పరిజ్ఞానంతో నెట్టుకొస్తారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. ఖర్చులు సామాన్యం. ఇతరులకు సాయం చేస్తారు. ఆహ్వానం అందుకుంటారు. పనులు హడావుడిగా సాగుతాయి. ప్రతి విషయంలోను ఆచితూచి అడుగేయండి. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు. తెగిపోయిన బంధుత్వాలు బలపడతాయి. రోజువారీ ఖర్చులే ఉంటాయి. కొత్త పనులు చేపడుతారు. అనవసర బాధ్యతలు చేపట్టి అవస్థపడతారు. నోటీసులు అందుకుంటారు. సోదరులను సంప్రదిస్తారు. ఏకాగ్రతతో వాహనం నడపండి. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ఆర్థిక పురోగతి లేకుండా నిస్తేజానికి లోనవుతారు. అతిగా ఆలోచించవద్దు. ఆత్మీయులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. మనోధైర్యంతో శ్రమిస్తారు. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. పిల్లల ఉన్నత చదువులపై దృష్టిసారిస్తారు. గృహనిర్మాణం పూర్తి కావస్తుంది. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
లావాదేవీలతో హడావుడిగా ఉంటారు. శ్రమాధిక్యత, అకాల భోజనం వద్దు. ఆచితూచి అడుగేయండి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు, పనుల ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. ముఖ్యుల కలయిక వీలుపడదు. ఖర్చులు అధికం, ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. సమర్థతను చాటుకుంటారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. పొదుపు ధనం అందుతుంది. వాహనం కొనుగోలు చేస్తారు. మీ ఉన్నతి కొందరికి ఆపోహ కలిగిస్తుంది. విమర్శలు పట్టించుకోవద్దు.
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. పెద్దల ఆశీస్సులందుకుంటారు. కలుపుగోలుగా వ్యవహరిస్తారు. మీ ఆతిథ్యం ఆకట్టుకుంటుంది. పనులు చురుకుగా సాగుతాయి. దుబారా ఖర్చులు విపరీతం, ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. ఆత్మీయులను సంప్రదిస్తారు.
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
కార్యం సిద్ధిస్తుంది. అనుకున్న ఫలితాలు సాధిస్తారు. మీ కృషి ప్రశంసనీయమవుతుంది. ప్రణాళికలు చేసుకుంటారు. ఆత్మీయుల రాక ఉత్సాహాన్నిస్తుంది. మాట అదుపులో ఉంచుకోండి. ఇతరులను తప్పు పట్టవద్దు. మీ తప్పిదాలను సరిదిద్దుకోటానికి యత్నించండి. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
లావాదేవీలు ముగుస్తాయి. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఆదాయానికి తగ్గట్టుగా లెక్కలేసుకుంటారు. స్థిమితంగా పనులు పూర్తి చేస్తారు. ప్రముఖులకు చేరువవుతారు. అందరితోను మితంగా సంభావించండి. మీ వ్యాఖ్యలను కొందరు వక్రీకరిస్తారు. జాగ్రత్త అవసరం.  
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
కీలక అంశాలపై పట్టు సాధిస్తారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. ఆత్మస్థైర్యంతో అడుగులేస్తారు. ధనసహాయం తగదు. పనులు హడావుడిగా సాగుతాయి. కావలసిన పత్రాలు కనిపించవు. చిన్న విషయానికి చికాకుపడతారు. ఆత్మీయులను కలుసుకుంటారు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
కార్యక్రమాలు విజయవంతమవుతాయి. అభీష్టాలు నెరవేరుతాయి. అనుకున్నది సాధిస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. ఆధిపత్యం చెలాయించవద్దు. ఆశలొదిలేసుకున్న బాకీలు వసూలవుతాయి. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. పిల్లల దూకుడు అదుపు చేయండి.
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఏ విషయాన్నీ సమస్య అనుకోవద్దు. దుబారా ఖర్చులు. విపరీతం. పనుల ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. వేడుకకు హాజరవుతారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి.
About Writer
పి.ప్రసూనా రామన్
తర్వాతి కథనం
వైశాఖ మాసం.. అష్టమి రోజున కాలభైరవ పూజ చేస్తే.. కుంకుమ దానంతో...?