1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
  4. Today 21-04-2026 Your Daily Horoscope

21-04-2026 మంగళవారం ఫలితాలు : పెద్దమొత్తం ధనసహాయం తగదు...

daily horoscope
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
కార్యసిద్ధికి ఓర్పుతో శ్రమించండి. సాయం అర్ధించవద్దు. ఖర్చులు విపరీతం. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. కొత్తప్రదేశం సందర్శిస్తారు.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
వాక్చాతుర్యంతోనెట్టుకొస్తారు. మీ శ్రమ ఫలిస్తుంది. దుబారా ఖర్చులు విపరీతం. ఆత్మీయులతో సంభాషిస్తారు. కొత్త యత్నాలు ప్రాంభిస్తారు. పనులు అనుకున్న విధంగా సాగవు. ఒత్తిడికి గురికావద్దు. శుభకార్యానికి హాజరవుతారు. విలువైన వస్తువులు జాగ్రత్త.
 
మిధునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
సంకల్పం సిద్ధిస్తుంది. ధనయోగం, వాహనసౌఖ్యం ఉన్నాయి. రుణవిముక్తులవుతారు. ఆలోచనలు కార్యరూపం దాల్చు,తాయి. ఖర్చులు సంతృప్తికరం. అనవసర జోక్యం తగదు. కీలకపత్రాలు అందుకుంటారు. మీ సాయంతో ఒకరికి మంచి జరుగుతుంది.
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
కొత్త పనులు మొదలెడతారు. సన్నిహితుల ప్రోత్సాహం ఉంటుంది. ఖర్చులు విపరీతం. పనుల ప్రారంభంలో ఆటంకాలు ఎదురవుతాయి. మీ వ్యాఖ్యలు అపార్థాలకు దారితీస్తాయి. పెద్దల చొరవతో ఒక సమస్య సానుకూలమవుతుంది. పిల్లల చదువులపై దృష్టిసారిస్తారు.
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
పరిస్థితులు చక్కబడతాయి. మాట నిలబెట్టుకుంటారు. రావలసిన ధనం అందుతుంది. ఖర్చులు తగ్గించుకుంటారు. వాయిదా పడిన పనులు పూర్తవుతాయి. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. ప్రముఖుల సందర్శనం వీలుపడదు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
కార్యం నెరవేరే వరకు శ్రమించండి. ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. రాబడిపై దృష్టిపెడతారుపనులు, బాధ్యతలు అప్పగించవద్దు. అందరితోను మితంగా సంభాషించండి. ఒకరి వద్ద మరొకరి ప్రస్తావన తగదు. మీ మాటలు జారవేసే వ్యక్తులున్నారని గమనించండి. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
లావాదేవీలతో సతమతమవుతారు. పెద్దమొత్తం ధనసహాయం తగదు. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు, కారక్రమాలు సాగవు. నోటీసులు అందుకుంటారు. పెద్దల చొరవతో సమస్య పరిష్కారమవుతుంది. అసాంఘిక కార్యకలాపాల జోలికి పోవద్దు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఆదాయం బాగుంటుంది. మొండి బాకీలు వసూలవుతాయి. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
ఉత్సాహంగా యత్నాలు సాగిస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. ఆర్భాటాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. కష్టమనుకున్న పనులు తేలికగా పూర్తవుతాయి. ఒప్పందాలకు అనుకూలం. సమయానుకూలంగా మెలుగుతారు. ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు. 

మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
లక్ష్యాన్ని సాధిస్తారు. మీ సామర్థ్యంపై నమ్మకం కలుగుతుంది. ఆశలొదిలేసుకున్న ధనం అందుతుంది. పనులు, బాధ్యతలు పురమాయించవద్దు. అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. పిల్లల భవిష్యత్తుపై దృష్టిపెడతారు. ఒక సమాచారం సంతోషాన్నిస్తుంది.
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
కార్యసాధనకు మరింత శ్రమించాలి. ఆశావహదృక్పథంతో మెలగండి. యత్నాలు విరమించుకోవద్దు. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. ఆత్యీయుల వ్యాఖ్యలు కార్యోన్ముఖులను చేస్తాయి. ఆలోచనల్లో మార్పు వస్తుంది. చేపట్టిన పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
లక్ష్యసాధనకు సంకల్పబలం ముఖ్యం. ధైర్యంగా అడుగుముందుకేయండి. కష్టమనుకున్న పనులు తేలికగా పూర్తిచేస్తారు. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. ధనప్రలోభాలకు లొంగవద్దు. మిమ్ములను మోసగించేందుకు కొందరు యత్నిస్తారు. ఏకాగ్రతతో వాహనం నడపండి.
About Writer
పి.ప్రసూనా రామన్
తర్వాతి కథనం
వైశాఖ మాసంలో ఆరుద్ర నక్షత్రం, స్కంధ షష్ఠి-శ్రీ రామాను జయంతి.. అన్నీ ఒకే రోజు..