1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
  4. Today 16-04-2025 Daily Astrology

16-04-2026 గురువారం ఫలితాలు-మంచి చేయబోతే చెడు ఎదురవుతుంది

Daily Astrology
Daily Astrology
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
లావాదేవీలతో తీరిక ఉండదు. సమయానుకూలంగా మెలగండి. ప్రణాళికలు వేసుకుంటారు. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. సన్నిహితులతో సంభాషిస్తారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. ప్రముఖుల కలయిక వీలుపడదు. పనులు వాయిదా వేసుకుంటారు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
మనోధైర్యంతో యత్నాలు సాగించండి. ఏ విషయాన్ని పెద్దగా పట్టించుకోవద్దు. ఆత్మీయుల వ్యాఖ్యలు నిరుత్సాహపరుస్తాయి, ఖర్చులు విపరీతం. చేబదుళ్లు స్వీకరిస్తారు. చేపట్టిన పనులు సాగవు. నోటీసులు అందుకుంటారు. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
కార్యక్రమాలు విజయవంతంగా సాగుతాయి. ప్రతికూలతలను అనుకూలంగా మలుచుకుంటారు. కొంతమొత్తం ధనం అందుతుంది. అవసరాలు నెరవేరుతాయి. పనులు సావకాశంగా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. ఫోన్ సంబంధాలు నమ్మవద్దు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
సంప్రదింపులు ముగుస్తాయి. సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. ధనలాభం ఉంది. పొదుపు పథకాల పట్ల ఆకర్షితులవుతారు. పనులు చురుకుగా సాగుతాయి. ముఖ్యల కలయిక వీలుపడడు. వేడుకకు హాజరవుతారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి.
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
పొదుపు ధనం అందుతుంది. ఖర్చులు విపరీతం శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. ఆత్మీయులను సంప్రదిస్తారు. నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. ఎదురుచూస్తున్న పత్రాలు అందుకుంటారు. ప్రముఖులను కలుసుకుంటారు. గృహమరమ్మతులు చేపడతారు.
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ఆర్థికంగా ఆశించిన ఫలితాలుంటాయి. ఖర్చులు భారమనిపించవు. కొంతమొత్తం పొదుపు చేస్తారు. ఆత్మీయుల ప్రోత్సాహం కార్యోన్ముఖులను చేస్తుంది. కొత్తయత్నాలకు శ్రీకారం చుడతారు. పనులు సజావుగా సాగుతాయి. సన్నిహితులతో సంభాషిస్తారు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
కార్యసిద్ధి, ధనలాభం ఉన్నాయి. సమయస్ఫూర్తితో వ్యవహరిస్తారు. రోజువారి ఖర్చులే ఉంటాయి. పనులు సానుకూలమవుతాయి. సంతోషంగా కాలం గడుపుతారు. అనవసర జోక్యం తగదు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. సన్మాన, సాహిత్య సభల్లో పాల్గొంటారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
అప్రమత్తంగా ఉంచాల్సిన సమయం. మీ తప్పిదాలను సరిదిద్దుకోండి. దంపతుల మధ్య చాపలికల తగదు. మొండి బాకీలు లౌక్యంగా రాజట్టుకోవాలి. పసులు మొండిగా పూర్తి చేస్తారు. ప్రియతములతో సంభాషిస్తారు. వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
పరిస్థితులు చక్కబడతాయి. సమస్యలను ధైర్యంగా ఎదుర్కుంటారు. యత్నాలకు ఆస్తులు ప్రోత్సాహిస్తారు. రోజువారి ఖర్చులే ఉంటాయి. ఇంటి విషయాలపై దృష్టి పెడతారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. పోగొట్టుకున్న చిత్రాలు తిరిగి సంపాదిస్తారు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
సర్వత్రా అనుకూలమే. రావలసిన ధనం అందుతుంది. తాకట్టు విడిపించుకుంటారు. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. ఖర్చులు అధికం. వాహనం, విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. వివాహయత్నాలకు శ్రీకారం చుడతారు. మధ్యవర్తులను ఆశ్రయించవద్దు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ఆటుపోట్లను ధైర్యంగా ఎదుర్కుంటారు. ఒత్తిడి పెరగకుండా చూసుకోండి. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. మంచి చేయబోతే చెడు ఎదురవుతుంది. వాయిదాల చెల్లింపులో జాప్యం తగదు. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
నిర్విరామంగా శ్రమిస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. లావాదేవీలో ఏకాగ్రత వహించండి. ఇతరుల కోసం వ్యయం చేస్తారు. పనులు ఒక పట్టాన సాగవు. మీ సాయంతో ఒకరికి మేలు జరుగుతుంది. నోటీసులు అందుకుంటారు. కొత్త పరిచయాలు బలపడతాయి.
About Writer
పి.ప్రసూనా రామన్
తర్వాతి కథనం
అహోబిలం నరసింహ స్వామి ఆలయంలో వార్షిక వసంతోత్సవాలు