13-04-2026 సోమవారం ఫలితాలు - గ్రహస్థితి ఆశాజనకం.. పరిస్థితులు చక్కబడతాయి...
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
గ్రహస్థితి ఆశాజనకం. పరిస్థితులు చక్కబడతాయి. కొందరి వ్యాఖ్యలు ఉద్రేకపరుస్తాయి. మీ ఆగ్రహావేశాలు అదుపులో ఉంచుకోండి. రోజువారీ ఖర్చులే ఉంటాయి. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. ముఖ్యుల కలయిక వీలుపడదు. కార్యక్రమాలు సాగవు.
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
వ్యవహారాల్లో ఏకాగ్రత వహించండి. ఖర్చులు విపరీతం. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. అందరితోను మితంగా సంభాషించండి. పత్రాల్లో సవరణలు సాధ్యమవుతాయి. సొంతంగా ఏదైనా చేయాలనే ఆలోచన బలపడుతుంది. కీలక సమావేశాల్లో పాల్గొంటారు.
మిధునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
సమర్థతను చాటుకుంటారు. వ్యాపకాలు అధికమవుతాయి. రావలసిన ధనం అందుతుంది. ప్రియతములను కలుసుకుంటారు. ఒక సమాచారం ఉల్లాసాన్నిస్తుంది. లావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలి. ప్రలోభాలకు లొంగవద్దు. ప్రయాణం వాయిదా వేసుకుంటారు.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. మీ కష్టం ఫలిస్తుంది. కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు. విలాసాలకు విపరీతంగా ఖర్చు చేస్తారు. పిల్లల చదువులపై దృష్టి సారిస్తారు. పనులు సానుకూలమవుతాయి. సన్మాన, సంస్కరణ కార్యక్రమాల్లో పాల్గొంటారు.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ధృఢసంకల్పంతో యత్నాలు సాగించండి. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. వ్యవహారంలో జాగ్రత్త. ఒత్తిళ్లకు లొంగవద్దు. సకాలంలో పనులు పూర్తిచేస్తారు. చెల్లింపులను అశ్రద్ధ చేయకండి. ప్రియతములతో సంభాషిస్తారు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. వాహనం ఇతరులకివ్వవద్దు.
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
కార్యసిద్ధికి సంకల్ప బలం ముఖ్యం. ఉత్సాహంగా యత్నాలు సాగించండి. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. ఖర్చులు సామాన్యం. లావాదేవీల్లో ఏకాగ్రత వహించండి. కీలక పత్రాలు జాగ్రత్త. కొత్త వ్యక్తులతో మితంగా సంభాషించండి. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు.
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
మీ నమ్మకం వమ్ముకాదు. కొన్ని విషయాలు ఊహించినట్టే జరుగుతాయి. ఖర్చులు సామాన్యం. నోటీసులు అందుతాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. మీ జోక్యం అనివార్యం. పనులు హడావుడిగా సాగుతాయి. చర్చల్లో పాల్గొంటారు. ప్రయాణం తలపెడతారు.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ధనలాభం, వాహనయోగం ఉన్నాయి. ఖర్చులు విపరీతం. పనులు సానుకూలమవుతాయి. దూరపు బంధువులతో సంభాషిస్తారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. కీలక పత్రాలు సమయానికి కనిపించవు. స్థిమితంగా ఉండటానికి యత్నించండి.
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
లక్ష్యసాధనకు పట్టుదల ప్రధానం. ఆశావహదృక్పథంతో మెలగండి. ఆత్మీయుల వ్యాఖ్యలు కార్యోన్ముఖులను చేస్తాయి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. గృహం ప్రశాంతంగా ఉంటుంది. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. పనులు త్వరితగతిన సాగుతాయి.
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
విశేష ఫలితాలున్నాయి. మీ కష్టం వృధా కాదు. సభ్యత్వాలు స్వీకరిస్తారు. బాధ్యతగా మెలగాలి. విలాసాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. పనుల ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. మొండిధైర్యంతో ముందుకు సాగండి. చిన్న చిన్న విషయాలు పట్టించుకోవద్దు.
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. అవకాశాలు చేజారిపోతాయి. ఏ విషయాన్నీ తీవ్రంగా పరిగణించవద్దు. రావలసిన ధనం అందుతుంది. ధనసహాయం తగదు. పనులు పురమాయించవద్దు. మీ శ్రీమతి మాటతీరు అసహనం కలిగిస్తుంది. ఆత్మీయులతో సంభాషిస్తారు.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ఆలోచనలు నిలకడగా ఉండవు. నిస్తేజానికి లోనవుతారు. ఖర్చులు విపరీతం. అవసరాలు వాయిదా వేసుకుంటారు. సంప్రదింపులతో తీరిక ఉండదు. స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. వేడుకకు హాజరవుతారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి.
