సంబంధిత వార్తలు
12-04-2026 ఆదివారం ఫలితాలు - ఏ పనీ చేయబుద్ధికాదు
Daily Horoscope
లావాదేవీలతో తీరిక ఉండదు. తప్పటడుగు వేసే అస్కారం ఉంది. అనుభవజ్ఞుల సలహా పాటించండి. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు. ఆత్మీయులతో సంభాషిస్తారు. ఏ పనీ ముందుకు సాగదు. ఖర్చులు విపరీతం. వాయిదా పడిన మొక్కులు తీర్చుకుంటారు.
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
నిరుత్సాహం వీడి యత్నాలు సాగించండి. సాయం ఆశించవద్దు. చిత్తశుద్ధితో శ్రమిస్తే విజయం తథ్యం. పట్టుదలకు పోవద్దు. సన్నిహితుల వ్యాఖ్యలు సత్ప్రభావం చూపుతాయి. ఖర్చులు విపరీతం. బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. కార్యక్రమాలు సజావుగా సాగుతాయి.
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ప్రతికూలతలను అనుకూలతలుగా మలుచుకుంటారు. మీ సమర్ధతపై నమ్మకం కలుగుతుంది. ప్రణాళికాబద్ధంగా అడుగులేస్తారు. బాధ్యతలు అప్పగించవద్దు. ఖర్చులు అధికం. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. పత్రాలు జాగ్రత్త. కొత్త విషయాలు తెలుసుకుంటారు.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. విలాసాలకు వ్యయం చేస్తారు. సంప్రదింపులకు తగిన సమయం. ఒత్తిడికి గురి కావద్దు. పనుల్లో శ్రమ, చికాకులు అధికం. ఒక సమాచారం ఊరటనిస్తుంది. ముఖ్యుల కలయిక వీలుపడదు. మొండిగా కార్యక్రమాలు కొనసాగిస్తారు.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
లక్ష్యాన్ని సాధిస్తారు. ఒత్తిడి పెరుగకుండా చూసుకోండి. దుబారా ఖర్చులు విపరీతం. ఏ పనీ చేయబుద్ధికాదు. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. బంధువులను కలుసుకుంటారు. విందుకు హాజరవుతారు. మీ అలవాట్లు, బలహీనతలు అదుపులో ఉంచుకోండి.
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. ఒక సమాచారం ఉత్సాహపరుస్తుంది. పట్టుదలతో యత్నాలు సాగిస్తారు. ఖర్చులు తగ్గించుకుంటారు. పనులు మందకొడిగా సాగుతాయి. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. వాగ్వాదాలకు దిగవద్దు. ఆరోగ్యం బాగుంటుంది. ఉల్లాసంగా గడుపుతారు.
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
పరిస్థితులు చక్కబడతాయి. చాకచక్యంగా వ్యవహరిస్తారు. మీ సమర్ధతపై ఎదుటి వారికి గురి కుదురుతుంది. అర్ధాంతంగా పనులు ముగిస్తారు. ఖర్చులు విపరీతం. కొందరి మాటతీరు కష్టమనిపిస్తుంది. విమర్శలు పట్టించుకోవద్దు. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త,
వృశ్చికం : విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
కార్యక్రమాలు నిరాటంకంగా సాగుతాయి. లక్ష్యాన్ని సాధిస్తారు. ఖర్చులు విపరీతం. సభ్యత్వాలు స్వీకరిస్తారు. మీ కలుపుగోలుతనం ఆకట్టుకుంటుంది. ప్రముఖులకు సన్నిహితులవుతారు. అప్రియమైన వార్త వినవలసి వస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు.
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
వ్యవహారంలో ఒత్తిడి పెరగకుండా చూసుకోండి. కొందరి వ్యాఖ్యలు ఉద్రేకపరుస్తాయి. పసులు హడావుడిగా సాగుతాయి. దుబారా ఖర్చులు అధికం. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి, పిల్లల అత్యుత్సాహం అదుపు చేయండి. మకరం :
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
మాట నిలబెట్టుకుంటారు. గౌరవప్రతిష్టలు పెంపొందుతాయి. కీలక పత్రాలు జాగ్రత్త. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. కొందర్ రాక ఇబ్బంది కలిగిస్తుంది. దంపతుల మధ్య కలహం, సామరస్యంగా మెలగండి. పెద్దల చొరవతో సమస్య సద్దుమణుగుతుంది.
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
వ్యవహారాలతో తీరిక ఉండదు. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. ఖర్చులు అధికం. పనులు సాగవు, చీటికిమాటికి చికాకుపడతారు. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. గృహమార్పు అనివార్యం. వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ప్రయాణం వాయిదా వేసుకుంటారు.
మీనం : పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
శమతో కూడిన ఫలితాలున్నాయి. ఉచితంగా ఏదీ ఆశించవద్దు. స్వయంకృషితోనే లక్ష్యాన్ని సాధిస్తారు. మీ సామర్ధంపై నమ్మకం పెంచుకోండి. బంధువులతో సంభాషిస్తారు. ఖర్చులు అధికం. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. ప్రముఖుల ఇంటర్వ్యూ వీలుపడదు.
